33.2 C
Hyderabad
September 30, 2026
ప్రత్యేకంహోమ్

ఒత్తిడికి లొంగిపోయిన కేంద్ర ఎన్నికల సంఘం

#GyneshKumar

ప్రతిపక్షాల ఒత్తిడికి కేంద్ర ఎన్నికల సంఘం లొంగిపోయింది. ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారి కోసం ఉపయోగించే ఆన్‌లైన్‌ ఫారం-6లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన వివాదాస్పద డిక్లరేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. దీంతో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలతో పాటు, ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాని రాష్ట్రాల్లోనూ ఫారం-6లో అదనపు డిక్లరేషన్‌ను సమర్పించాల్సిన అవసరం ఉండదు.

కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి సమావేశం సెప్టెంబర్‌ 26న నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెల్లడించాయి. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనూ, ఆ ప్రక్రియ లేని సమయంలోనూ ఫారం-6లో ఎలాంటి మార్పులు ఉండవని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి.

SIR జరుగుతున్న రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6తో పాటు అదనపు డిక్లరేషన్‌ను సమర్పించాలని గతంలో కోరారు. ఎన్నికల సంఘం 2025 జూన్‌ 24న జారీ చేసిన ప్రత్యేక సమగ్ర సవరణ ఆదేశాల ఆధారంగా ఈ అదనపు డిక్లరేషన్‌ను తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం ఏకగ్రీవ నిర్ణయం మేరకే ఈ విధానాన్ని అమలు చేసినట్లు పేర్కొన్నాయి.

తాజాగా సెప్టెంబర్‌ 26న జరిగిన పూర్తి స్థాయి సమావేశంలో ఈ అదనపు డిక్లరేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఇకపై ఫారం-6లో కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియలో ఈ అదనపు డిక్లరేషన్‌ ఉండదు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లోనే కాకుండా, ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాని రాష్ట్రాల్లోనూ ఇదే విధానం అమల్లో ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఈ నిర్ణయంతో ఫారం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించిన విధానంలో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో అదనపు ప్రకటనను జతచేసే విధానం నిలిచిపోనుంది.

Related posts

వీబీజీ రామ్ జీ పథకం ప్రారంభించిన చంద్రబాబు

Satyam News

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు పొడిగింపు

Satyam News

బాలల హక్కుల పరిరక్షణ బృహత్తరమైన బాధ్యత 

Satyam News

సర్వేల్లో వైసీపీ గ్రాఫ్‌ డౌన్‌…. ఆయనే మెయిన్‌ విలన్‌..??

Satyam News

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News

నెట్టెంపాడు భూ సేకరణ 45 రోజుల్లోగా పూర్తవ్వాలి

Satyam News

Leave a Comment