ఆధ్యాత్మికంహోమ్

ఎగువ గొట్టివీడు యల్లమ్మ జాతరలో చాందిని బండి

గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు, యర్రయ్యగారిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ యల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన కావలి రవణమ్మ చెంగయ్య కుమారుడు మోహన్ – శ్రావణి మొక్కుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన చాందిని బండి పూజా కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కావాలి వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ బాబుకు బ్రహ్మ రథం పట్టి, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి చాందిని బండిని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ..”గ్రామ దేవతల జాతరలు సంస్కృతికి ప్రతీకలని, భక్తిభావం మనుషుల మధ్య ఐక్యతను పెంచుతుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు” తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Related posts

మూసీ పునరుజ్జీవం పేరుతో రేవంత్ మోసం

Satyam News

ఎమిరేట్స్ నుంచి స్పైస్ జెట్ ప్రత్యేక విమానాలు

Satyam News

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News

విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలం

Satyam News

సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం

Satyam News

తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం

Satyam News

Leave a Comment