మహబూబ్ నగర్హోమ్

ఆడపిల్లకు జరిగిన అన్యాయంపై అడిగితే అక్రమ కేసులు

#Wanaparthy

వనపర్తిలో అక్షర స్కూల్ లో మైనారిటీ బాలికపై జరిగిన అత్యాచారాన్ని ప్రశ్నించడానికి వెళ్ళిన నాయకులు నందిమల్ల అశోక్, చీర్ల.చందర్, మెకానిక్.శ్రీను మరో 6 మందిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వనపర్తిలో పోలీస్ స్టేషన్ ముందు మెరుపు ధర్నా నిర్వహించారు. బి.ఆర్.ఎస్ నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యములో  ధర్నా నిర్వహించారు. ఆడపిల్లపై అత్యాచారం చేసిన నిందితున్ని యాజమాన్యాన్ని కాపాడాలనే  భారీ కుట్రలో బాగంగా నాయకులను అరెస్ట్ చేశారని చెప్పారు. ప్రభుత్వపరంగా బాధిత బాలికకు,కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంచేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాజశేఖర్ గౌడ్, పెద్దిరాజు, కాగితాల లక్ష్మీనారాయణ, ఉంగ్లం తిరుమల్ మున్సిపల్ కౌన్సిలర్సు మురళి సాగర్ శ్రీకర్ గౌడ్ చింటూ సమద్ స్టార్ రహీం, హేమంత్ ముదిరాజ్, జోహార్ హుస్సేన్, సూర్యవంశం గిరి, యుగంధర్ రెడ్డి, చిట్యాల రాము,సి.పి.ఎం నాయకులు పరమేశ్వరా చారి , సి.పి. ఐ నాయకుడు గోపాల్ కృష్ణ  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మీడియా ఫ్రంట్‌ పేజీలో.. పేద పిల్లల ఫోటోలు.. లోకేశ్‌ సూపర్‌!

Satyam News

రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Satyam News

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News

పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులకు మోక్షం

Satyam News

బాధ్యతలు స్వీకరించిన డీజీపీ శివధర్ రెడ్డి

Satyam News

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News

Leave a Comment