ముఖ్యంశాలుహోమ్

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

#Polavaram

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు సిద్దార్థ్ పీ హెడవూ, శ్రీ హరి టి నాయర్, గౌరవ్ పాండే ఉన్నారు. వీరు  మంగళవారం గ్యాప్ 1 ప్రాంతంలో ఏడు పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగిస్తున్న, మట్టి, పదార్ధాలు, రాళ్లు అన్ని నాణ్యతగా ఉన్నాయని తేలింది. ఈ పరీక్ష నిర్వహించటానికి ఏడు గంటల సమయం పడుతుంది.  బుధవారం ఇదే తరహా పరీక్షలు గ్యాప్ 2 లో ఈ బృందం నిర్వహించనుంది.  సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ డి ఈ లు శ్రీకాంత్, విజయ్ కుమార్, ఎం ఈ ఐ ఎల్  పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య ఉన్నారు.

Related posts

మానవహక్కుల మండల్ ఉపాధ్యక్షుడిగా చించొలే

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

పశ్చిమ బెంగాల్ లో చీలిపోయిన మమతా బెనర్జీ పార్టీ

Satyam News

బహిరంగంగా లంచాలు వసూలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు?

Satyam News

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

Satyam News

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు డొనేషన్

Satyam News

Leave a Comment