23.7 C
Hyderabad
September 13, 2026
కరీంనగర్హోమ్

ఎల్లంపల్లి నీళ్లకు కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం

#Ramadugu

ప్రస్తుతం విడుదల చేస్తున్న నీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినది కాదని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరేనని రామడుగు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జవ్వాజి హరీష్ అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ వద్ద సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా వేద పండితులతో బీఆర్ఎస్ నాయకులు తాకిన ప్రాంతాన్ని శుద్ధి చేయించిన అనంతరం మాట్లాడుతూ దీనిని కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

WhatsApp Image 2026-08-03 at 15.43.32 (1)
ప్రక్షాళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గోదావరి నదిపై శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేశామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం కుంగిపోయిందని, నీటిని ఎత్తిపోతే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని జాతీయ డ్యాం భద్రతా సంస్థ (NDSA) నివేదికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

అయినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని జవ్వాజి హరీష్ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకత్వాన్ని ఇక నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎంత విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, రానున్న ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని విమర్శించారు. అంతేకాకుండా ఆయనకు బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా ఆ పార్టీ అధిష్ఠానంలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోల రమేష్, బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్ప శ్రీనివాస్ రెడ్డి, మంత్రి మహేందర్, బతిని శ్రీనివాస్ గౌడ్, నాగభూషణ్ రెడ్డి, సువిన్ యాదవ్, ఉప్పని అంజన్న ప్రసాద్, ఆరు మండలాల మార్కెట్ కమిటీలు, సింగిల్ విండో పాలకవర్గ సభ్యులు, రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం

Satyam News

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

Satyam News

పరకామణి దొంగలు చేసిన దారుణ హత్య ఇది…

Satyam News

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

Satyam News

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

Satyam News

జగన్ భారతీ రెడ్డి లను విచారించాల్సిందే

Satyam News

Leave a Comment