ఆధ్యాత్మికంహోమ్

శ్రీశైలంలో భారీ గా పెరిగిన భక్తుల రద్దీ

#SrisailamTemple

ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది..వేసవి సెలవులు నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో భక్తులు మల్లన్నను దర్వించుకుంటోన్నారు. దీంతో వారికి కల్పించే సౌకర్యాలు, స్పర్శ దర్శనం టికెట్లకు సంబంధించిన అంశాలపై ఆలయ అధికారులు దృష్టి సారించారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు.

రద్దీ అధికంగా కావడం వల్ల ఈ విధానాల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రొటోకాల్‌ వీఐపీ బ్రేక్‌ స్పర్శ దర్శన టిక్కెట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నేటి నుంచి నుంచి జూన్‌ 1వ తేది వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. అలంకార దర్శనాలు మాత్రమే కల్పించనున్నారు. వారాంతపు సెలవులు కావడంతో పాటు వేసవి ముగింపు దశకు రావడంతో శ్రీశైలానికి సాధారణ భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

Related posts

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News

భారత ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్ భేటీ

Satyam News

వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ‘నకిలీ’ నోట్ల కలకలం

Satyam News

అడ్మిషన్ల కోసం టీచర్లపై వత్తిడి తెస్తున్న ప్రయివేటు స్కూళ్లు

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

ఘనంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారం

Satyam News

Leave a Comment