ప్రత్యేకంహోమ్

జగన్‌ని భయపెడుతున్న ఇండియా టుడే సర్వే

#Jagan

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి… మరోసారి పవర్‌లోకి రావాలని పగటి కలలు కంటున్నాడు.. వాటికి బ్రేక్‌ వేసింది ఇండియా టుడే – సీ ఓటర్‌ మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే… కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత మొదలయిందని, ఇటీవల వైసీపీ అనుకూల సర్వే ఒకటి వెలుగులోకి వచ్చింది.. దీనిపై తన ప్రెస్‌ మీట్‌లోనే ప్రశ్నలు అడిగించుకొని సంబరపడి పోయాడు జగన్‌. అది ఫేక్‌ సర్వే అని, అంత సీన్‌ లేదని 2024 ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయమని తేల్చి చెప్పిన సర్వే నిపుణుడు ఆరా మస్తాన్‌ బల్ల గుద్ది మరీ చెప్పాడు.

ఆరా మస్తాన్‌ వివరణతో డల్‌ అయిన వైసీపీ టీమ్‌కి, తాజాగా మూడ్‌ ఆఫ్‌ నేషన్‌ సర్వేతో క్లియర్‌ పిక్చర్‌ వచ్చిందనే చర్చ మొదలయింది.. సీ ఓటర్‌తో కలిసి ప్రతి ఆరు నెలలకి ఒకసారి ఇండియా టుడే ప్రజల అభిప్రాయాలని, వారి ఆలోచన సరళిని, దేశంలో ప్రస్తుత రాజకీయ ట్రెండ్స్‌ని అంచనా వేస్తుంది. దేశవ్యాప్తంగా వేలమంది అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుంటుంది.. ఆగస్ట్‌ మూడవ వరకు చేసిన ఈ తాజా సర్వేలో మరోసారి ఢిల్లీ పీఠంపై ఎన్‌డీఏ కూటమి జెండా ఎగరవేయడం ఖాయం అని తేల్చి చెప్పింది.

ప్రస్తుతం ఎన్నికలు జరిగితే, ఎన్‌డీఏ కూటమికి 326 ఎంపీ స్థానాలు, ఇండీ కూటమికి 185 సీట్లు వస్తాయని తెలిపింది.. కేవలం బీజేపీ 261 స్థానాలు గెలవనుందని వివరించింది.. ఇక, కాంగ్రెస్‌ గతం కంటే కాస్త కోలుకొని 106 సీట్లు దక్కించుకుంటుందని ప్రకటించింది.. జెన్‌ జీ, కాక్‌రోచ్‌ జనతా పార్టీ ఉద్యమంతో ఎన్‌డీఏ హవా ముగిసిందని, ఇక తాను కాంగ్రెస్‌ కూటమిలోకి జంప్‌ చేయవచ్చని వైసీపీ అధినేత జగన్‌ గత కొంతకాలంగా భావిస్తున్నారనే లీకులు బయటకు వస్తున్నాయి.. బెంగళూరులో ఇటీవల జగన్‌… కాంగ్రెస్‌ కీలక నేత కేసీ వేణుగోపాల్‌ని సీక్రెట్‌గా కలిశారనే ప్రచారం జరుగుతోంది.. ఈ పరిణామం తర్వాతే వైసీపీలోని కీలక నేతలపై ఈడీ ఎటాక్స్‌ మొదలయ్యాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.

ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి సమర్ధవంతమైన పాలన అందిస్తోంది.. అభివృద్ది, సంక్షేమంతో దూసుకుపోతోంది.. జగన్‌ విధ్వంసకర పాలన నుండి కోలుకుంటోంది.. ఏపీ రెవెన్యూ కూడా మెరుగుపడుతోంది.. ఈ నేపథ్యంలో జగన్‌కి మరోసారి చాన్స్‌ ఇవ్వడానికి ప్రజలు రెడీగా లేరు.. జగన్‌ ప్రమోటెడ్‌ సర్వేలు మినహా, టాప్‌ మోస్ట్ స్ట్రాటజిస్టులు సైతం ఏపీలో ఎన్‌డీఏ కూటమి హవాని తేల్చిపారేస్తున్నాయి.. ఈ విషయం జగన్‌కి బాగా తెలుసు.. ఇదే వైసీపీని టెన్షన్‌ పెడుతోంది.. మరి, రాబోయే రోజుల్లో జగన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని పార్టీని గట్టెక్కిస్తాడో ఆసక్తికరంగా మారుతోంది.

Related posts

సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

Satyam News

అనుమతి లేకుండా ర్యాలీలు ధర్నాలు చేపడితే చర్యలు

Satyam News

సంక్రాంతి కానుకగా ప్రభాస్ నిమ్మల”మిరాకిల్” ఫస్ట్ లుక్!!

Satyam News

అమరావతి బిల్లుకు తెలంగాణ మంత్రి హర్షం

Satyam News

గణనీయంగా తగ్గిన దుబాయ్ ప్రయాణీకుల సంఖ్య

Satyam News

జగన్‌, భారతి డ్రీమ్‌ ప్యాలెస్‌ గేట్లు ఓపెన్….

Satyam News

Leave a Comment