హైదరాబాద్హోమ్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం

#PonnamPrabhakar

హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ కే. కేశవరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి , శ్యాం మోహన్ పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం కమిటీ ఇప్పటికే వివిధ యూనివర్సిటీల ఉద్యమకారులు, కళాకారులు, సబ్బండ వర్గాలతో సంప్రదింపులు జరిపింది. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన పనుల పురోగతిని సమావేశంలో సమీక్షించారు. గుర్తింపు ప్రక్రియలో ఇంకా చేపట్టాల్సిన చర్యలు, వాటి పురోగతిపై కమిటీ సభ్యులు చర్చించారు.

ఉద్యమకారుల గుర్తింపు కోసం ఏర్పాటు చేయనున్న వెబ్‌సైట్ ప్రస్తుత స్థితి, ఎప్పటిలోగా ప్రారంభించాలి, వెబ్‌సైట్ ఏర్పాటును వేగవంతంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించిన వెబ్‌సైట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని విధాలుగా కృషి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. వెబ్‌సైట్ ఏర్పాటుపై తదుపరి పురోగతిని త్వరలోనే మరోసారి సమీక్షించి, వెబ్‌సైట్ ప్రారంభం, తదుపరి కార్యాచరణపై మరో ప్రకటన చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

Related posts

పిల్లల్ని వదిలి ప్రియుడి తో పరారు… అడ్డం తిరిగిన కథ

Satyam News

క్యాన్సర్ తో బాధపడుతున్న బాలలకు చిత్రలేఖనం పోటీలు

Satyam News

చిన జీయర్ కు శ్రీగురూజీ సవాల్

Satyam News

కరీంనగర్ సీపీ పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

Satyam News

కామ్రేడ్ సురవరం ఇక లేరు

Satyam News

Lokesh Magic: కార్పొరేట్‌ను తలదన్నే ప్రభుత్వ స్కూల్స్!

Satyam News

Leave a Comment