ముఖ్యంశాలుహోమ్

వేసవిలో నీటి తొట్టెల ద్వారా పశువులకు తాగునీరు

#cattle

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక అనుసంధానంతో  గ్రామీణ ప్రాంతాలలో నీటి తొట్టెలను నిర్మించి, వేసవిలో పశువులకు తాగునీటి వసతి కల్పించడం జరిగిందని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో పశువులు, జీవాల నీటి కొరతను అధిగమించడానికి పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నీటి తొట్టెలను నిర్మించి త్రాగునీటి వసతి కల్పించామన్నారు.

ఈ తొట్టెల్లో నీటి నిర్వహణను స్థానిక పంచాయితీ రాజ్, పశుసంవర్ధక శాఖ  సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారన్నారన్నారు. శాఖలను సమన్వయం చేసుకుంటూ, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల సహకారం కూడా తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు.

​పశుపోషకులు, స్వయం సహాయక సంఘాల వారు, అవసరమైన ప్రాంతాలలో నీటి తొట్టెల ఏర్పాటు కోసం స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో గానీ లేదా పశువైద్యశాలలో గానీ సంప్రదించాలని పశుసంవర్ధక శాఖ  సంచాలకులు డా. టి దామోదర్ నాయుడు ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జూలకంటి

Satyam News

ఢిల్లీలో లోకేష్‌ మార్క్‌…. యువనేతకి కీలక ఆహ్వానం….!

Satyam News

ఉత్సాహంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Satyam News

త్వరలో జేపీ నడ్డా వారసుడి ఎంపిక

Satyam News

IVF యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నేరెళ్ల తేజ సాయి వెంకట్

Satyam News

సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై రాష్ట్ర‌ హోంమంత్రి ఆదేశాలు

Satyam News

Leave a Comment