ముఖ్యంశాలుహోమ్

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ వెంకట రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లుగా సస్పెన్షన్‌లో ఉన్న ఆయన ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకుంది. ఆయనకు ఇంకా 14 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉండటం గమనార్హం.

వెంకట రామిరెడ్డి గత ప్రభుత్వ కాలంలో రెండు సార్లు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయనపై అబ్కారీ నిబంధనల ఉల్లంఘన, ఎన్నికల సంఘం చర్యలు వంటి వివాదాలు కూడా నమోదయ్యాయి.

ఆర్టీసీ ఉద్యోగులను ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రేరేపించినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేసింది. అలాగే అనుమతి లేకుండా ఉద్యోగులకు మద్యం పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలతో అబ్కారీ శాఖ కేసు నమోదు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత నియమించిన ప్రత్యేక కమిటీ ఈ ఆరోపణలను పరిశీలించి నిజమని తేల్చడంతో ఆయనను సేవల నుంచి తొలగించింది.

Related posts

నీట్ గా లీక్ చేసిన లెక్చరర్లు: మరొకరు అరెస్టు

Satyam News

మొట్టమొదటి ఏఐ-ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీ

Satyam News

దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ

Satyam News

పారదర్శకంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత?

Satyam News

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు

Satyam News

Leave a Comment