కరీంనగర్హోమ్

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

#paddypurchasecenter

వన్నారం గ్రామంలో పి ఏ సి ఎస్ కొక్కెర్ కుంట ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ‌ సోమవారం ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ ఓం ప్రకాష్ తో కలిసి మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్ దీన్ని ప్రారంభించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు పెద్దపీట వేసిందని అంతేకాకుండా రైతులు పండించిన వారి ధాన్యం పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ని కూడా ఇస్తుందని తెలిపారు.

రైతులు ఆర్థికంగా ఎదగడం కోసమే ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని కోరారు. రైతు భరోసా నిధులు కూడా ఇస్తుందని అంతేకాకుండా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు కేంద్రనికి తీసుకురావాలని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకే అమ్ముకోవాలని తెలిపారు.

అలాకాకుండా దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ ఉప సర్పంచ్ బండారి లక్ష్మణ్ అధికారులు రైతులు గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మానవ జీవితం గొప్పగా ఉండేందుకే సనాతన ధర్మం

Satyam News

బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి వైసీపీ కుట్ర

Satyam News

రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం

Satyam News

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం

Satyam News

సారిక వ‌ద్ద ప‌ది ఎక‌రాల్లో జిల్లా జైలు నిర్మాణం

Satyam News

Leave a Comment