జాతీయంహోమ్

మొక్కజొన్న పంటను కొనుగోలు చేయండి

#SivarajChowhan

2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్కజొన్న పంటను తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, మార్కెట్‌లో ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1600 నుంచి రూ.1700 మధ్య మాత్రమే ఉండగా, కనీస మద్దతు ధర రూ.2400 కంటే చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని, సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉందని లేఖలో వివరించారు. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి మద్దతు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.

మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు PM-AASHA పథకం కింద ధరల వ్యత్యాస చెల్లింపు విధానాన్ని అమలు చేయాలని, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణించి, ధరల వ్యత్యాసానికి సంబంధించిన నిధులను 100 శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని, NAFED, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణ అనుమతులు ఇవ్వాలని లేఖలో కోరారు. రైతులు నష్టపోకుండా కేంద్రం తక్షణమే స్పందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Related posts

ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!

Satyam News

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు!

Satyam News

రష్యాలో డ్రోన్‌ దాడులు.. బాంబుల మోత మధ్య లోకేశ్‌ సాహసం

Satyam News

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌

Satyam News

పేరుకే ప్రభుత్వ ఉద్యోగి… జీవితమంతా జగన్ సేవ

Satyam News

Leave a Comment