హైదరాబాద్హోమ్

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావు (కేఎస్‌ఆర్), సంబంధిత ఫేస్‌బుక్ పేజీ నిర్వాహకులు, సాక్షి ఛానల్ అడ్మిన్లపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అడ్వకేట్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 10న సాయంత్రం 6 గంటలకు బేగంబజార్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, జూలై 10 మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఫేస్‌బుక్‌లో ప్రసారమైన సాక్షి ఛానల్ డిబేట్ వీడియోలో వైఎస్సార్సీపీ ప్రతినిధి నాగార్జున యాదవ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పలుమార్లు “జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్” అంటూ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రికి జీఓ, జీఓ మిస్సెలేనియస్ వంటి పదాల పూర్తి రూపాలు కూడా తెలియవని వ్యాఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

డిబేట్ నిర్వహించిన యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోకుండా మౌనంగా ఉండటంతో పాటు, సంబంధిత వీడియోను ఫేస్‌బుక్‌లో కొనసాగిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోను తొలగించాలని, సోషల్ మీడియా సంస్థల నుంచి ఐపీ లాగ్స్, అప్లోడర్ల వివరాలను సేకరించాలని, ఐటీ రూల్స్–2021 ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

ఫిర్యాదు ఆధారంగా బేగంబజార్ పోలీసులు క్రైమ్ నం. 175/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 192, 352, 353(1), 353(2) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

వేడుకగా లక్ష్మీ నరసింహ పుష్పయాగం

Satyam News

మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు

Satyam News

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News

సింధు జలాల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్

Satyam News

హై స్పీడ్ రైల్‌ నెట్‌వర్క్‌ హబ్‌గా ఏపీ

Satyam News

కొత్త జిల్లాలలపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి

Satyam News

Leave a Comment