ప్రకాశంహోమ్

వేగంగా పల్నాడు ప్రకాశం ‘జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార’

#PavanKalyan

ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా పల్నాడు–ప్రకాశం ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోపు పూర్తి కావాలని ఆదేశించారు. బుధవారం పల్నాడు–ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా పనుల పురోగతిని ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ. 2,500 కోట్లు కాగా, అందులో రూ. 1,290 కోట్ల అంచనా వ్యయంతో ప్రకాశం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో, 593 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకానికి సంబంధించి ఇంటేక్ వెల్ నిర్మాణం పనులు 40 శాతానికి పైగా పూర్తయ్యాయి.

119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్ పనులు, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రకాశం వాటర్ గ్రిడ్ పథకం కింద ఇప్పటి వరకు 53 కిలోమీటర్ల మేర పైపు లైన్ల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు.రూ. 1,200 కోట్లతో చేపట్టిన పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని 235 ఆవాసాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించగా, ఇప్పటికే 152 కిలోమీటర్ల మేర పైపు లైన్ నెట్వర్క్ పూర్తయ్యింది. ఇన్ టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా పురోగతిలో ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రూ. 95 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్టు తాగునీటి సరఫరా విభాగం అధికారులు వివరించారు.

పల్నాడు తాగునీటి ఇబ్బందులు తీరిపోవాలి

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తాగు నీటి సమస్యతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులుపడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు చాలా కీలకమైనవి. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిర్ణీత గడువులోపు ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగు నీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలి. గ్రామాల మధ్య పైపు లైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు లాంటి సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి.

పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను సాధ్యమైనంత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలి. భుజం శస్త్ర చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తా. జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దు. పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో  16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుంద”న్నారు.

Related posts

కలెక్టర్ కు పిర్యాదు చేసినా చర్యలు నిల్

Satyam News

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News

ఫ్రీ బస్‌ స్కీమ్ పై మహిళల స్పందన ఎలా ఉంది?

Satyam News

అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసిన చంద్రబాబు

Satyam News

భారత్ నౌకలపై ఇరాన్ దాడి: పొరపాటా గ్రహపాటా?

Satyam News

ఇల్లు కాపాడితేనే పండుగ సంతోషం

Satyam News

Leave a Comment