26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

శ్రీ కనక దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర సమర్పణ

#KanakadurgaTemple

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు, ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత  నల్ల విజయ్ కుమార్ మంగళవారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. తన తండ్రి, ప్రముఖ చేనేత శిల్పి అవార్డు గ్రహీత స్వర్గీయ నల్ల పరంధాములు స్ఫూర్తితో, వారి అడుగుజాడల్లో నడుస్తూ తాను ప్రత్యేకంగా నేసిన అత్యంత విలక్షణమైన పట్టుచీరను శ్రీ కనకదుర్గ అమ్మవారికి అలంకరణ చేయవలసినదిగా ఆలయ ఈవో వికె శీనా నాయక్ కు అందజేశారు.

​‘అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర’ ప్రత్యేకతలు: ​చేనేత రంగానికే మచ్చుతునకగా నిలిచిన ఈ పట్టుచీరను విజయ్ కుమార్ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించి మగ్గంపై అద్భుతంగా మలిచారు.

​పరిమాణం & బరువు: ఈ అద్భుత పట్టుచీర పొడవు 5.5 మీటర్లు (ఐదున్నర మీటర్లు), వెడల్పు 48 ఇంచులు ఉంటుంది. ఇంత పెద్ద పరిమాణం ఉన్నప్పటికీ, దీని బరువు కేవలం 200 గ్రాములు మాత్రమే కావడం విశేషం. ​ఈ పట్టుచీరను సాంప్రదాయ, ఆకర్షణీయమైన ‘ఇక్కత్ డిజైన్’  వచ్చేలా అత్యంత నైపుణ్యంతో రూపొందించారు. ​ఈ చీరను మడతపెడితే సులభంగా ఒక చిన్న అగ్గిపెట్టెలో ఇమిడిపోతుంది. ​

ఈ సందర్భంగా చేనేత కళాకారుడు  నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ “గతంలో నేను తయారు చేసిన ప్రతి సరికొత్త చేనేత సృష్టికి ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆశీస్సులు లభించాయి. ఎల్లప్పుడూ దుర్గమ్మ తల్లి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటూ ఈ సరికొత్త పట్టుచీరను సమర్పించి, అమ్మవారి కృపకు పాత్రులం కావడం ఎంతో సంతోషంగా ఉంది.

గతంలో మేము ‘ఆపరేషన్ సింధు’ పేరిట అద్భుతమైన శాలువను తయారు చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీకి అందించి, వారి చేతుల మీదుగా ఘనమైన ప్రశంసలు పొందాము. ప్రధాని ప్రశంసలు పొందిన అదే స్ఫూర్తితో, చేనేత కళా నైపుణ్యాన్ని చాటుతూ ఈ చీరను రూపొందించడం జరిగింది.

​అమ్మవారికి సమర్పించిన ఈ అద్భుతమైన చేనేత కళాఖండాన్ని ఆలయఈవో శీనానాయక్ పరిశీలించి,అసాధారణ ప్రతిభ చూపిన చేనేత కళాకారుణ్ణి ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్న రీతిగా మన సంప్రదాయ కళలను ప్రతి ఒక్కరూ ఆదరించాలని శీనానాయక్ కోరారు.

Related posts

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: డీజీపీ సీవీ ఆనంద్

Satyam News

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News

గవర్నర్‌ను కలిసిన నూతన సీఎస్ సంజయ్ జాజు

Satyam News

“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లు పూర్తి

Satyam News

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన ‘భ్రమయుగం’

Satyam News

Leave a Comment