పశ్చిమగోదావరిహోమ్

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

#Polavaram

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్ధాల పరిశోధనా సంస్థ (సి ఎస్ ఎం ఆర్ ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు మరో రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ బృందంలో సి ఎస్ ఎం ఆర్ ఎస్ లోని మట్టి, వివిధ పదార్ధాల పరీక్షల నిపుణులు హరేంద్ర ప్రకాష్,  అవినాష్ ఆనంద్ శ్రీవాస్తవ, గౌరవ్ పాండియా , విజయ్ ప్రతాప్ సింగ్  ఉన్నారు.

వీరు  మంగళవారం ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ లో మట్టి, ఇసుకల నాణ్యతను పరీక్షించారు. ఈసీఆర్ఎఫ్  లో బంకమట్టి,  కొద్దిగా ఇసుక కలిసినట్లుగా ఉండే మట్టిని వినియోగిస్తున్నారు. ఒక్కో దొంతరకు ఒక్కో మట్టిని నిపుణుల సూచన మేరకు వినియోగిస్తున్నారు.

ప్రతి దొంతరకు వినియోగించే మట్టి, ఇసుక, రాళ్ల నాణ్యతను పరీక్షించాల్సిందిగా  పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ  సి ఎస్ ఎం ఆర్ ఎస్  నిపుణుల్ని కోరింది. వారు ప్రతి నెలా పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు.   ఈ పరీక్షల్లో  భాగంగా రెండు రకాల మట్టి, ఇసుక నాణ్యతని నిపుణులు పరీక్షించారు.

ఈ పరీక్షల్లో అవి నాణ్యతగా ఉన్నాయని తేలింది.   బుధ, గురువారాల్లో ఇదే తరహా పరీక్షలను ఈ బృందం నిర్వహించనుంది. సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం వెంట జలవనరుల శాఖ ఈఈ శ్రీనివాస్,  డి ఈ  నిర్మల ఎం ఈ ఐ ఎల్  పోలవరం ప్రాజెక్ట్ జి ఎం ఏ గంగాధర్, డి జి ఎం లు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య, వ్యాప్కోస్ అధికారులు  ఉన్నారు.

Related posts

వెనిజులాలో భారీ భూకంపం: 32 మంది మృతి

Satyam News

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News

రాతి యుగానికి వెళ్దాం రండి ట్రంప్ గారూ…

Satyam News

జగన్ హయాంలో భారీ ‘విద్యుత్’ కుంభకోణం

Satyam News

సింహ వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల అభయం

Satyam News

జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.4064.59 కోట్లు

Satyam News

Leave a Comment