27.8 C
Hyderabad
September 11, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు

#Tirumala

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ ఏడాది హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం రావడంతో భక్తులకు రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. ప్రతి ఏడాది జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 15 నుంచి 23 వరకు నవాహ్నికంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు ముందు సెప్టెంబరు 14న అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబరు 15న సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి భక్తుల కనువిందు చేసేలా శ్రీ మలయప్పస్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించనున్నారు.

బ్రహ్మోత్సవాల రెండో రోజు అయిన సెప్టెంబరు 16న ఉదయం చిన్నశేష వాహన సేవ నిర్వహించనున్నారు. అనంతర రోజుల్లో సంప్రదాయబద్ధంగా వివిధ వాహన సేవలు, ప్రత్యేక ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ కార్యాచరణ రూపొందిస్తోంది.

అధిక మాసం కారణంగా ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించనున్నారు. ఈ రెండు బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో భద్రత, వసతి, దర్శనం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, లడ్డూ ప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related posts

నవ్యాంధ్రలో తొలిసారిగా 41వ ‘ఐఏటీఓ’ జాతీయ సదస్సు

Satyam News

ఆసుపత్రిలో అనారోగ్యంతో ముద్రగడ…. పలకరించని జగన్…..!!

Satyam News

కేవ్డా మొక్క: హిమాలయాల కంటే ముందే భారత్‌లో మనుగడ

Satyam News

బర్బరీకుడు ద సన్నాఫ్ ఘటోత్కచ మూవీ గ్రాండ్ ఓపెనింగ్

Satyam News

ఉయ్యూరులో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

Satyam News

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News

Leave a Comment