రంగారెడ్డిహోమ్

వైభవంగా శ్రీ పరమేశ్వర లింగం శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ కొత్తగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పరమేశ్వరుని శివలింగం, గ్రామ దేవత శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వేద పండితులు యు. రమణ చార్యులు ఇతర పండితులు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేడుకలు ఈ నెల 24 నుండి 26 వరకు శాస్త్రోక్తంగా జరిగాయి.

ఈ మహోత్సవంలో భాగంగా మొదటి రోజు శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, వేదపరాయణం, యాగశాల ప్రవేశం, అఖండ స్థాపన, చతుర్ లింగతో భద్రమండలి, వాస్తు, యోగని, క్షేత్ర పాలక, నవగ్రహ, అష్టదిక్పాలక, అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.

రెండవ రోజు శ్రీ గణపతి పూజ, మండప పునః పూజలు, నవగ్రహ రుద్రా, కాలభైరవ, అమ్మవారి మూల మంత్రం, శివ రుద్ర నమక చమక బిజ అక్షర హోమం, జలాధివాసం, ధాన్యధివాసం వంటి విశేష పూజలు నిర్వహించారు.

మూడవ రోజు అంటే 26 వ తేదీ ఉదయం నుండి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శివలింగం, పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరిగాయి. అనంతరం పూర్ణాహుతి, శాంతి కళ్యాణం మరియు భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు ఆలయ ధర్మకర్త & నిర్వాహకులు రేగుల శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Related posts

నిన్న BR నాయుడు..ఇవాళ ABN…. జగన్‌ శత్రువులు ఎవరు?

Satyam News

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

Satyam News

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Satyam News

ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు

Satyam News

కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లు

Satyam News

Leave a Comment