హైదరాబాద్హోమ్

బూత్ లెవెల్ పోలింగ్ అధికారులకు సహకరించండి

జాతీయ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఓటర్స్ అందరికీ ఎన్యుమరేషన్ ఫామ్స్ ను బిఎల్ఓ అధికారులు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరిగిందని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి & బిఎల్ఏలు అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఏడెల్లి అజయ్ కుమార్ తెలిపారు.

సోమవారం అంబర్పేట్ నియోజకవర్గంలో ఆయన బిఎల్ఓల వద్దకి వెల్లి ప్రజలకు ఇచ్చిన ఎస్ఐఆర్ ఫారాలను పరిశిలించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్లు చాలామంది అధికారులకు ఫారాలు తిరిగి ఇవ్వకుండా అలాగే ఓటర్స్ దగ్గర పెట్టుకోవడంతో వారికి ఉన్నటువంటి ఓటు హక్కును కోల్పోతారని, చాలామందికి తెలవటం లేదు ఇప్పటిదాకా ఉన్న ఓటర్ లిస్ట్ను ప్రక్షాళన చేయడంలో భాగంగా జరుగుతున్న ఈ ప్రక్రియలో అధికారులు ఇచ్చినటువంటి ఏన్యూమరేషన్ ఫామ్ ని ఫిలప్ చేసి ఆగస్టు 10వ తేదీ లోపల ఇవ్వనట్లయితే మనకు ఉన్న ఓటు హక్కుని కోల్పోతామని ప్రజలందరూ గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు.

పాత లిస్టును పూర్తిగా తీసివేసి ఇప్పుడు ఎవరైతే ఎన్యుమరేషన్ ఫాన్స్ ఇస్తున్నారో వాళ్ళవి మాత్రమే కొత్తగా వచ్చే డ్రాఫ్ట్ లిస్టులో చేర్చడం జరుగుతుందని, ఇప్పుడు వచ్చే డ్రాఫ్ట్ లిస్టు రాబోయే 20 సంవత్సరాలకు మదర్ లిస్ట్ గా వ్యవహరిస్తుందని ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరారు. గతంలో ఓటు ఉంది కదా అని ఆలోచనలో ఉన్న వాళ్లకి మా ఓటు ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటే పొరపాటు పడ్డట్టేనని బిఎల్ఓ అధికారులు ఇచ్చినటువంటి ఎన్యూమేషన్ ఫామ్ ని నింపి మరల అధికారులకు ఇచ్చినప్పుడు మాత్రమే ఆగస్టు మాసంలో వచ్చేటువంటి డ్రాఫ్ట్ లిస్టులో పొందుపరచడం జరుగుతుందని ప్రజలందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

కావున ఓటర్స్ అందరూ బిఎల్ఓ అధికారులకు సహకరించి ఎన్యుమరేషన్ ఫామ్స్ ని వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో 41 పోలింగ్ బిఎల్ఓ అధికారి వీరబోయిన ముక్తేశ్వర్ రావు, బిజెపి బిఎల్ఏ ఏడెల్లి బాలు, ఇమిడి రఘునందన్, మస్కా మహేష్ కుమార్, ఏడెల్లి బాలాజీ, బి.సాయి చరణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ అంబర్పేట్

Related posts

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News

నారాయణ భక్తి మార్గం పై సటైర్లు…

Satyam News

కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ మాకు రోడ్లు లేవు

Satyam News

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News

మంగుళూరు రేవు కు చేరిన వంట గ్యాస్ షిప్

Satyam News

తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అక్రమ వసూళ్లు

Satyam News

Leave a Comment