ముఖ్యంశాలుహోమ్

ధర్మం మంటగలిస్తే… ఆ త్రికూటేశ్వరుడు కన్నెర్ర చేయడా?

ఆధ్యాత్మికతకు నిలువుటద్దం కోటప్పకొండ. ఏటా మహాశివరాత్రి వేళ, లక్షలాది మంది భక్తులు తమ గ్రామాల గౌరవాన్ని ‘ప్రభలు’గా మలచి ఆ త్రికూటేశ్వరుని పాదాల చెంతకు చేరుస్తారు. కానీ, ఈ ఏడాది ఆ సంబరాల్లో ఒక విషాద ఛాయ, ఒక భయంకరమైన అపశృతి చోటుచేసుకుంది.

వైకాపా రాజకీయ రంగు పూసుకున్న ఒక భారీ ప్రభ, ధర్మం తప్పిన రీతిలో కుప్పకూలి కాలిబూడిదవ్వడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.

తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను గాయపరిచిన సంగతి తెలిసిందే. అయితే, తాజా మీడియా రిపోర్ట్స్ మరియు సిట్ (SIT) విచారణలో బయటపడుతున్న నిజాలు అంతకంటే దారుణంగా ఉన్నాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నెయ్యి కల్తీ కేవలం తిరుమలకే పరిమితం కాలేదని, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి పవిత్ర శైవ క్షేత్రాలకు కూడా ఇది విస్తరించిందని సిట్ నిర్ధారించింది.

మే 2022 నుండి మార్చి 2023 వరకు శ్రీశైలం మల్లన్న ఆలయానికి దాదాపు 3.25 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని విచారణలో తేలింది.

శ్రీకాళహస్తి ఆలయంలో కూడా నాణ్యత లేని, రసాయనాలతో కూడిన నెయ్యిని ప్రసాదాల తయారీలో వాడారనే ఆరోపణలు భక్తులను కలవరపెడుతున్నాయి.

నిప్పులు కురిపించిన త్రినేత్రుడు!

కోటప్పకొండలో వైకాపా ప్రభ కుప్పకూలి, అగ్నికి ఆహుతి కావడం కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదని… అది ఆ శివయ్య ఆగ్రహానికి నిదర్శనమని సామాన్య భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు.

“దేవుడి నైవేద్యాన్ని అపవిత్రం చేసి, భక్తుల విశ్వాసంతో ఆడుకున్న వారికి ఆ త్రికూటేశ్వరుడే ఒక హెచ్చరిక పంపుతున్నాడు” అనే చర్చ ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోంది.

ఎత్తైన ప్రభలు… భక్తుల ఆశలకు, ఆచారాలకు చిహ్నాలు. అటువంటిది, వైకాపా రాజకీయ పార్టీకి చెందిన ప్రభ ఇలా బూడిదవ్వడం వెనుక దైవ నిర్ణయం ఉందనే భావన భక్తుల్లో వ్యక్తమవుతోంది. లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనర్లలో వాడే రసాయనాలు కలిశాయన్న వార్తలు, సాక్షాత్తు శివుడి క్షేత్రాల్లోనే అపవిత్రత చోటుచేసుకోవడం వల్లే ఆ భోళాశంకరుడు కన్నెర్ర చేశాడని ప్రజలు విశ్వసిస్తున్నారు.

రాజకీయం ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ, దైవ సన్నిధిలో మాత్రం ధర్మమే గెలవాలి. ధర్మాన్ని రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే, ఆ కాలభైరవుడు తన త్రినేత్రాన్ని తెరుస్తాడని చెప్పడానికి కోటప్పకొండ ఘటనే ఒక నిదర్శనం.

భక్తుల కన్నీరు, దైవ ద్రోహం ఎన్నటికీ ఊరికే పోవు.

Related posts

గద్వాల పట్టణంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి

Satyam News

కోస్తాలో వైసీపీ ఖాళీ..?? ఆ 5గురు మాజీ ఎమ్‌ఎల్‌ఏలు జంప్‌..??

Satyam News

మదర్సా విద్యార్థులకు, మహిళలకు నూతన వస్త్రాల అందజేత

Satyam News

లష్కరే ఉగ్రవాదిని కాల్చి చంపిన భద్రతాదళాలు

Satyam News

పార్టీ జెండా గద్దె నమూనా ఆవిష్కరించిన కవిత

Satyam News

మమత ఓటమిపై కాంగ్రెస్ సంబరాలు: రాహుల్ హెచ్చరిక

Satyam News

Leave a Comment