30.2 C
Hyderabad
September 16, 2026
ఆధ్యాత్మికంహోమ్

పాలపిట్ట దర్శనం శుభసూచకం

విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా 9 రోజుల పాటు దుర్గాదేవిని భక్తి తో పూజిస్తాం. చివ‌రి రోజున ఉత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వహిస్తాం. అయితే ద‌స‌రా రోజు రావ‌ణ‌ద‌హ‌నంతోపాటు చేయాల్సిన కార్య‌క్ర‌మాల్లో మ‌రొక‌టి.. పాల‌పిట్ట ద‌ర్శ‌నం. ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను దర్శించుకోవ‌డం వ‌ల్ల‌ అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే అస‌లు పాల‌పిట్ట‌ను ఎందుకు ద‌ర్శించుకోవాలి ? దాని వెనుక ఉన్న అస‌లు కార‌ణం ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను ముగించాక విజ‌య‌ద‌శ‌మి రోజున శ‌మీ వృక్షంపై ఉన్న త‌మ ఆయుధాలను తీసుకుని హ‌స్తినాపురం వైపు ప్ర‌యాణ‌మ‌వుతారు. అదే స‌మ‌యంలో వారు పాల‌పిట్ట‌ను చూస్తారు. దీంతో వారికి ఆ త‌రువాత అన్నీ శుభాలే క‌లుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌర‌వుల‌పై వారు విజ‌యం సాధిస్తారు. అప్ప‌టి నుంచి ద‌స‌రా రోజున పాల‌పిట్ట‌ను చూడ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి.

పాల‌పిట్ట సాక్షాత్తూ దేవీ స్వ‌రూప‌మ‌ని, అది ఉత్త‌ర దిక్కు నుంచి వ‌స్తే ఇంకా మంచిద‌ని, శుభాలు, విజ‌యాలు క‌లుగుతాయని పండితులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. విజ‌య‌ద‌శ‌మి రోజున క‌చ్చితంగా పాల‌పిట్ట‌ను చూడండి.. చూడ‌డం మాత్రం మ‌రిచిపోకండి..!

Related posts

జగన్‌కి ఢిల్లీ సంకేతాలు…. బెంగళూరులో ఆ నేతలతో సీక్రెట్ మీటింగ్!

Satyam News

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

Satyam News

భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రధాన లక్ష్యం

Satyam News

వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

Satyam News

బిల్ గేట్స్ పర్యటన కోసం అంతా సిద్ధం

Satyam News

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Satyam News

Leave a Comment