ఆంధ్రప్రదేశ్

బాలికను కిడ్నాప్ చేసిన వైకాపా కార్యకర్త

#ycp

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో  మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన వైకాపా కార్యకర్త గోవర్ధన్ అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగింది. గత మూడు రోజుల క్రితం బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బాలిక తల్లి రూరల్ అప్గ్రేడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం, ఫోక్సు కేసు నమోదు చేసినట్లు సిఐ ఆంజనేయులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన యువకుడు బాలికను ఇంస్టాగ్రామ్ లో ట్రాప్ చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. తండ్రి లేకపోవడంతో తల్లి అనారోగ్యంతో బాధపడుతూ పేదరికంతో ఉండడంతో బాలిక చదువు మాని తల్లి ఆలన పాలన చూసుకుంటుంది.

కర్ణాటకకు చెందిన తల్లి కూతుర్లు ఉపాధి కోసం మూడేళ్ల క్రితం హిందూపురం మండలానికి వచ్చి ఇక్కడే  అద్దె ఇంట్లో ఉంటున్నారు. పేదరికంలో ఉన్న బాలికకు డబ్బు ఆశ చూపి లొంగు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.

ఈ ఘటన జరిగి మూడు రోజులు అయినప్పటికీ గ్రామస్తుల సమాచారంతో బయటపడింది. గోవర్ధన్ కు  సహకరించిన సోము అనే మరో యువకుడు పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో గోవర్ధన్, సోములు ఉన్నారు.

Related posts

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

Satyam News

అర్హులైన వారి పింఛన్ల తొలగింపు ప్రసక్తే లేదు

Satyam News

అమరావతి కి వచ్చిన ‘బాన్‌బ్లాక్ టెక్నాలజీ’

Satyam News

Leave a Comment