సంపాదకీయంహోమ్

మహనీయుల సరసన రాజకీయం ఏంటి?

#Botsa

గణతంత్ర వేడుకల సాక్షిగా వైకాపా కార్యాలయంలో చోటుచేసుకున్న దృశ్యాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, విప్లవ వీరుడు సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల చిత్రపటాల సరసన… కేవలం ఒక రాజకీయ వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోను ఉంచడం అత్యంత శోచనీయం. ఇది ఆ మహనీయుల త్యాగాలను అవమానించడమే కాక, జాతీయ స్ఫూర్తిని కించపరచడమే!

సొంత చెల్లెలు షర్మిల సాక్షిగా… జగన్ తన తండ్రి పేరునే అక్రమాస్తుల కేసుల్లోకి లాగారని ఆరోపిస్తుంటే, ఇప్పుడు అదే వ్యక్తిని జాతీయ నాయకులతో సమానంగా నిలబెట్టడం ఏ సంకేతాలను ఇస్తుంది? ఇక ఈ వేడుకను పర్యవేక్షించిన బొత్స సత్యనారాయణ గారి గతాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. “గాంధీ పుట్టినరోజున కూడా మద్యం చుక్క లేనిదే వైఎస్సార్ నిద్రపోరు” అంటూ గతంలో ఇదే బొత్స తీవ్ర విమర్శలు చేశారు. మరి ఈనాడు ఏ ముఖం పెట్టుకుని గాంధీజీ పక్కన వైఎస్సార్ చిత్రాన్ని ఉంచారో ఆయనే సమాధానం చెప్పాలి.

రాజ్యాంగం పట్ల గౌరవం లేని తీరు, జాతీయ పతాకానికి వందనం చేయడానికి కూడా బెంగళూరు ప్యాలెస్ దాటి రాని బెంగుళూరు అంకుల్ జగన్ నైజం గురించి ప్రజలందరికీ తెలుసు. రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే నడవాలనే అహంకారంతో, జాతీయ నాయకులను అవమానిస్తూ వైకాపా నేతలు చేస్తున్న ఈ చర్యలు క్షంతవ్యం కాదు. ధృతరాష్ట్రుడి కౌగిలిలాంటి ఈ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టడం భావ్యం కాదు.

ఈ చర్య ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? మహనీయుల స్థాయిని దిగజార్చినందుకు, దేశ ప్రతిష్టను మంటగలిపినందుకు వైకాపా నాయకత్వం తక్షణమే రాష్ట్రానికి, దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి.

Related posts

భారత విమానయానంపై యుద్ధ ప్రభావం తీవ్రం

Satyam News

రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

Satyam News

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

Satyam News

హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 కొత్త ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

బాల రాముడిని కొల్లగొట్టిన వారంతా అరెస్టు

Satyam News

ఎల్ నినో దృష్ట్యా రైతులు ఆరుతడి పంటల పై దృష్టి సారించాలి

Satyam News

Leave a Comment