ముఖ్యంశాలుహోమ్

న్యూయార్క్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలు

#NewYark

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో అసమాయి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక న్యూయార్క్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు.

వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా చిన్నారులచే నిర్వహించిన పూజా కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలకు మరింత శోభ చేకూరింది. భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ కార్యక్రమంలో ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త, సంఘ శ్రేయోభిలాషి డా. పైళ్ల మల్లారెడ్డి దంపతులు,  కౌంటీ ప్రముఖులు పాల్గొని వేడుకలను తిలకించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో  అధ్యక్షుడు రవీందర్ కొడెలతో పాటు కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు విశేష కృషి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తూ, పూజా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

కార్యవర్గ సభ్యులు, ఆలయ నిర్వాహకులు, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కొడెల కృతజ్ఞతలు తెలిపారు. న్యూయార్క్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, భవిష్యత్ తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలు, సనాతన సంప్రదాయాలను పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు. పూజల్లో భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తుల ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి.

Related posts

జూబ్లీహిల్స్ గెలుపు రేవంత్ రెడ్డిదే

Satyam News

ఎన్‌డీఏలో పవర్‌ఫుల్‌ లీడర్‌గా లోకేష్‌

Satyam News

మంత్రి నారాయణ విదేశీ పర్యటన

Satyam News

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

Satyam News

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఫతేఖాన్‌పేట పోలీస్ క్వార్టర్స్

Satyam News

శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక మాసం వనభోజనాలు

Satyam News

Leave a Comment