సినిమాహోమ్

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

#PCAditya

వందేమాతర గీతం రచించి 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా బెంగళూరులో జరిగిన వందేమాతరం వేడుకలు అవార్డు ప్రధాన కార్యక్రమంలో తెలుగు సినీ రంగానికి చెందిన విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు ప్రతిష్టాత్మక వందేమాతరం పురస్కారాన్ని అందజేశారు.

నైన్ ఫిగర్ మీడియా ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్ణాటక లా కమిషన్ చైర్మన్ జస్టిస్ అశోక్ హాజరయ్యారు. ప్రత్యేక అతిధులుగా డాక్టర్ నే జ్యోతి నీరజ సీఈవో పీపుల్ ట్రీ హాస్పిటల్, ప్రముఖ సిని నిర్మాత సంతోష్ కుమార్ ఆచార్య తదితరులు హాజరయ్యారు.

ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు నిష్ణాతులకు వందేమాతరం అవార్డులను అందజేశారు. అందులో భాగంగా తెలుగు సినీ రంగానికి చెందిన నిత్య ప్రయోగశిలి, విలక్షణ దర్శకుడు డాక్టర్ పిసి ఆదిత్యను వందేమాతరం అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు నైన్ ఫిగర్ మీడియా చైర్మెన్ కే సంపత్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్య తన సుదీర్ఘ సినీ జీవితంలో ఎంతోమంది నూతన కళాకారులకు అవకాశాలు కల్పించడం అభినందనీయం. నేడు వందేమాతరం పురస్కారం అందుచేయటం మాకు సంతోషంగా ఉందన్నారు.

నిర్వాహకులు డాక్టర్ అభినందన్ మాట్లాడుతూ ఆదిత్య వంటి నిష్ణాతులైన దర్శకుడిని వందేమాతరం అవార్డుతో సత్కరించడం గర్వంగా ఉందన్నారు. ముఖ్య అతిథి జస్టిస్ అశోక్ బి మాట్లాడుతూ ఆదిత్య కేవలం తెలుగులోనే కాక కన్నడలో కూడా సందేశాత్మక చిత్రాలు రూపొందించాలని కోరారు.

ప్రముఖ శని నిర్మాత సంతోష్ కుమార్ ఆచార్య ఆదిత్య అభినందిస్తూ ఆదిత్య దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో మంచి చిత్రాన్ని రూపొందిస్తారని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మక వందేమాతరం అవార్డు అందుకున్న ఆదిత్య స్పందిస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరిని అందుకోవడం సంతోషంగానే గర్వంగానే ఉందని నూతన ప్రతిభను  ప్రోత్సహించడంలో తనకు మరింత బాధ్యత కలిగిందని త్వరలోనే కన్నడ భాషలో కూడా సందేశాత్మక చిత్రం రూపొందిస్తానని హామీ ఇచ్చారు. వందేమాతరం అవార్డు గ్రహీత ఆదిత్యను అభిమానులు మిత్రులు అభినందించారు

Related posts

చేనేత గర్జనతో మార్మోగిన మంగళగిరి

Satyam News

యుద్ధ నేపథ్యంలోనూ వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ

Satyam News

జగన్‌, భారతి డ్రీమ్‌ ప్యాలెస్‌ గేట్లు ఓపెన్….

Satyam News

ప్రొఫెసర్ తో వైసీపీ గేమ్స్…. బ్లూ మీడియాలో ఫేక్‌ స్టోరీ

Satyam News

జోర్డాన్ అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడి

Satyam News

మంచి కంటెంట్‌తో రాబోతోన్న ‘కర’

Satyam News

Leave a Comment