ఆధ్యాత్మికంహోమ్

మూడవ రోజు కొనసాగుతున్న సప్తాహ భజన

#Maldakallu

సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సప్తాహ భజన నిర్విఘ్నంగా సాగుతున్నది. సోమవారం నాడు మూడవ రోజు సంకాపురం, బిజ్వారం పార్చర్ల, ఆరగిద్దశంకర్ నగర్, ఈదుల గార్లపాడు గ్రామాల చెందిన భజన భక్తాదులు సప్తాహ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, పూజారులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వరుణ దేవుని కరుణ ప్రతి ఒక్కరికి ఉండాలని శ్రీ తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో సుభిక్షంగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాన సత్రంలో భజన భక్తులకు ఐజ పట్టణానికి చెందిన బొజ్జయ్య శెట్టి అన్నదానం చేశారు.

ప్రతి ఆషాడ మాసం చివరిన ప్రారంభమై శ్రావణమాసం మొదటి వారంలో ముగిస్తుంది. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు, రామసుబ్బారెడ్డి, కొంకల ప్రసాదాచారి, వెంకోబ్రావ్, సోమన్న,తిమ్మప్ప,భజన మండలి సభ్యులు, వాల్మీకి పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు

Satyam News

పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

Satyam News

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

శాంతినగర్ పట్టణంలో అత్యంత వేడుకగా  శివలింగ ప్రతిష్ట.

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల కార్యాచరణ

Satyam News

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News

Leave a Comment