వరంగల్హోమ్

గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి

#RevanthReddy

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను అభివృద్ధి చేసే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ములుగు జిల్లా నుంచి శుభారంభం పలికారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించి ములుగులో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం ఎదురుగా పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు గ్రామాలను ప్రధాన రహదారులతో అనుసంధానించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ఈ ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు అనుసంధానించే విధంగా రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడం, విద్య, వైద్యం, ఉపాధి వంటి సేవలను గ్రామీణ ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి ములుగును కేంద్రంగా ఎంచుకోవడం ద్వారా రాష్ట్ర గ్రామీణ రవాణా రంగంలో కొత్త అధ్యాయానికి తొలి అడుగు పడిందని ప్రభుత్వం పేర్కొంది. రహదారుల నిర్మాణం, అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. ములుగు నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారుల అభివృద్ధికి కీలకంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Related posts

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Satyam News

ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

మహిళలపై అత్యాచారాలు ఎందుకు పెరిగాయి?

Satyam News

ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

Satyam News

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

Satyam News

Leave a Comment