32.2 C
Hyderabad
September 19, 2026
కరీంనగర్హోమ్

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప

#Ramadugu

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రామడుగు గ్రామంలో మాల సంఘం కమిటీ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ అన్నదానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై కే రాజు, తాసిల్దార్ దాసరి రాజ మల్లయ్య, మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కృపతో ఏటా ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు.

కేవలం పూజలు, భజనలకే పరిమితం కాకుండా, ‘అన్నదానం మహాదానం’ అనే సంకల్పంతో ప్రతి ఒక్కరికీ స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పూర్తి సహకారాన్ని అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

వచ్చిన ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు స్వయంగా వడ్డించి, క్రమశిక్షణతో ప్రసాద వితరణ సాగేలా పర్యవేక్షించారు. అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు భక్తులకు, సహకరించిన కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మొయిజ్, 14వ వార్డ్ మెంబర్ సిరికొండ పల్లవి సాయి, ఉత్సవ కమిటీ మెంబర్స్, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో  పాల్గొన్నారు.

Related posts

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News

భీమిలిలో న్యాయవాదిపై కత్తితో దాడికి యత్నం

Satyam News

గెలిచిన కాక్రోచ్: విద్యార్థులపై కేసులు కొట్టేసిన ‘సుప్రీం’

Satyam News

సౌదీ యువరాజు వివాదస్పద నిర్ణయం: ఆందోళన లో ముస్లింలు

Satyam News

కన్నుల పండుగగా శ్రీనివాసుని కళ్యాణం

Satyam News

క్లర్క్, లేడీ కానిస్టేబుల్ రాసలీలలు..!

Satyam News

Leave a Comment