విజయనగరంహోమ్

ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి ఆలయ విస్తరణకు అడ్డంకులు

#SriPaiditalliAmmavaru

ఉత్తరాంధ్రలోని విజయనగరంకు సుదీర్ఘ చారిత్ర ఉంది. రాజుల ఏలిన నేల, శ్రీ పైడితల్లి అమ్మవారు సాక్షాత్కరించిన పుణ్యభూమి. విజయనగరంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయం మరింతగా ప్రసిద్ధి గాంచినది.

ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి ఆలయ విస్తరణ ఎట్టకేలకు పూర్తయి ఈ నెల 26,27 తేదీలలో తొలి ఏరు, (తొలేళ్లు)సిరిమాను సంబరం అంగరంగ వైభవంగా జరగబోతోంది. అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మంగా శ్రీ పైడితల్లి ఆలయ కోటిన్నర లక్షలతో రూపుదిద్దుకున్న వేళ “చంద్రుడిలో ఒక నూలుపోగు” అన్న చందంగా ఆలయ తూర్పుభాగాన “సయ్యద్ మిర్జా” తాలూకా సమాధి(దర్గా) విస్తరణ కు అడ్డంకిగా మారింది.

పైగా దర్గాపై శ్రీ పైడితల్లి ఆలయానికి చెందిన బోర్డు లను వస్త్రం గా కప్పి ఉంచడం”సత్యం న్యూస్. నెట్ “కంట పడింది. మతవిశ్వాసాలకు ప్రతీకగా నిలిచే విజయనగరం లో ఉగ్రవాది సిరాజ్ తరపెట్టబోయే ఉగ్ర కుట్రలనే భగ్నం చేసి ప్రపంచ దృష్టినే తన వైపునకు మళ్లించుకుందా ఖ్యాతి నొందిన విజయనగరం. అలాంటి విజయనగరం కు మాణిక్యం శ్రీ పైడితల్లి దేవాలయం.

ఆ దేవాలయం పక్కనే సుమారు 300 ఏళ్ల నాటి దర్గా నిక్షిప్తమై ఉండటం నేడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు 3650 చదరపు అడుగులలో విస్తీర్ణం కాబడిన శ్రీ పైడితల్లి దేవాలయంకు ఈ దర్గా ఓ మచ్చ. ఇటీవలే విస్తరణ పనులలో దర్గా కూడ కూలిపోవడంతో అప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గరుండి తిరిగి తాత్కాలికంగా నిర్మాణం చేయడం విశేషం.

మరి అప్పుడే హైందవ సంప్రదాయం లో అతి పురాతన, ప్రాసశ్థ్యం చెందిన చరిత్ర పుటలకెక్కిన శ్రీ పైడితల్లి దేవాలయం పక్కనే దర్గా ఉండటం సంప్రదాయమేనా..???. అయితే ఈ సయ్యద్ మిర్జా దర్గ అంత ప్రాముఖ్యత కాదని స్థానిక ముస్లిం సోదరులే చెబుతుండటం విశేషం.

ఆ దర్గాకు ప్రాముఖ్యత లేదు

మా ఆ దర్గాకు అంత ప్రాధాన్యత లేదని సిటీ వాచ్ సెంటర్ యజమాని అస్లాం ఖాన్ అంటున్నారు. కేవలం డేంకాషవలీ దర్గా తో పాటు మూడు లాంతర్లు వద్ద, బాబామెట్ట ల వద్ద ఉన్న దర్గాలే  ప్రాచుర్యంలో ఉన్నాయంటున్నారు. ఇక దర్గాపై ఆలయ బోర్డులు కప్పుగా పెట్టడం విరుద్ధమన్నారు దర్గాకు మనిషి వెనక భాగం చూపించకూడదని, ఆ దర్గా ముందు గ్యాస్ స్టౌ రిపేర్ షాపు ఉండటం కూడా విరుద్ధమని పేర్కొన్నారు.

ఆ దర్గా గురించి తెలియదు… కేజీఎన్. సెల్ ఫోన్ షాప్ యజమాని

ఆ దర్గా గురించి అస్సలు మాకు తెలియదని అసలు అక్కడ దర్గా ఉందనే విషయం మాకెవ్వరికీ తెలియదు సెల్ ఫోన్ షాప్ యజమాని నవాజ్ అన్నారు. మాకు మూడు లాంతర్ల వద్ద ఉన్న దర్గా, కోట వద్ద ఉన్న దర్గా తెలుసు నని అన్నారు.

పెద్దలు పూనుకోవాలి

దేవాలయం సమీపంలో దర్గా ఉందన్న విషయం విజయనగరం పెద్దలకు తెలుసు నని శ్రీ పైడితల్లి ఆలయ అధికారి పీఆర్ఓ రమేష్ అన్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టామని అయితే ఆలయ విస్తరణ పనులకు మాత్రం అడ్డంకి కాదని స్పష్టం చేశారు.

Related posts

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Satyam News

దళితవాడల్లో టీటీడీ ఆలయాలు

Satyam News

ఆస్ట్రేలియాలో బిజీబిజీగా లోకేష్‌!

Satyam News

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌… వైజాగ్‌లో డెలాయిట్‌

Satyam News

ఆందోళనకర స్థాయిలో బలహీనపడ్డ రూపాయి

Satyam News

Leave a Comment