ప్రపంచంహోమ్

విదేశాల్లో మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ అరెస్టు

#MahadevBettingApp

మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రాకర్ ను సీబీఐ ఎట్టకేలకు భారత్ కు తెచ్చింది. ఓమన్ లో అరెస్టు చేసిన సీబీఐ సౌరభ్ చంద్రాకర్‌ను ఒమన్ నుంచి భారత్‌కు తీసుకురావడంలో సఫలమైంది.

అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు, ప్రజల సొమ్మును మోసం చేసి వసూలు చేశారనే ఆరోపణలపై ఆయనపై రెండు సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న చంద్రాకర్‌ను భారత్‌కు అప్పగించడం దర్యాప్తులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్ ద్వారా భారీ స్థాయిలో అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలు సాగించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ వ్యవహారంలో సుమారు రూ.6,000 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నెట్‌వర్క్‌ను సౌరభ్ చంద్రాకర్, అతని సహచరుడు రవి ఉప్పల్ నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొన్నది.

చంద్రాకర్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో ఒమన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. తాజాగా సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల సమన్వయంతో అతడిని భారత్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ కేసులో రాయ్‌పూర్‌లోని సీబీఐ న్యాయస్థానంలో తదుపరి విచారణ జరిగే అవకాశం ఉంది.

Related posts

ఢిల్లీలో భారీగా ఆయుధాలు స్వాధీనం

Satyam News

నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే హైడ్రా నిద్రపోతుందా?

Satyam News

బీజేపీ ప్రభుత్వానికి మమత తాజా హెచ్చరిక

Satyam News

మీ దగ్గరకొచ్చే చేనేత వస్త్రాలు కొంటాం

Satyam News

ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు

Satyam News

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: 3 వేల మంది టీచర్ల తొలగింపు!

Satyam News

Leave a Comment