సంపాదకీయంహోమ్

నడిరోడ్డుపై జగన్ ధర్నా..  పట్టించుకోని పులివెందుల జనం!

#YSJagan

పులివెందుల మున్సిపాలిటీలో ఎన్నడూ లేని విధంగా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దశాబ్దాలుగా పులివెందుల అంటే YS ఫ్యామిలీ చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండే పరిస్థితి ఈసారి కనిపించలేదు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే, వైసీపీ అధినేత జగన్‌ వైఖరికి భిన్నంగా పులివెందుల ఓటర్లు తమ స్వతంత్ర తీర్పును స్పష్టంగా వినిపించారు. జగన్‌ పిలుపును పక్కనపెట్టి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల రోజున ఓటు వేయకుండానే వెనుదిరిగిన జగన్‌ ఓ వైపు, మరోవైపు పులివెందుల ప్రజలు మాత్రం  ఉత్సాహంతో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ పరిణామం నియోజకవర్గంలో మారుతున్న ప్రజల ఆలోచనా దృక్పథానికి అద్దం పడుతోంది. నాయకులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, తమ  హక్కును వినియోగించుకోవడానికే ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.

అదే సమయంలో, జగన్ ప్రచార ర్యాలీకి ఎదురుగా వచ్చి అప్రూవర్‌గా మారిన దస్తగిరి వివేకా హత్య కేసుపై నిలదీయడం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఈ ప్రశ్న కేవలం దస్తగిరి ఒక్కడిది మాత్రమే కాదని, 7 ఏళ్లుగా సమాధానం దొరకని వివేకా హత్యోదంతంపై మొత్తం పులివెందుల ప్రజల గుండెల్లో మెదులుతున్న ప్రశ్నే. ఈ ఘటన పులివెందులలో మునుపటి రాజకీయ ఆధిపత్యం సడలిపోతోందనడానికి స్పష్టమైన నిదర్శనం.

నాటకీయ పరిణామాల మధ్య జగన్ పులివెందుల నడిరోడ్డుపై ధర్నాకు దిగడం మరో మలుపు. గత 30 ఏళ్ల కాలంలో పులివెందుల అడ్డాలో ఏ ఇతర నాయకుడూ ఇలాంటి ఆందోళనలు చేయకుండా అడ్డుకున్న చరిత్ర వైఎస్‌ ఫ్యామిలీది. ఇవాళ అదే పులివెందులలో జగన్ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం గమనార్హం. అయితే, దశాబ్దాలుగా ఏకపక్షంగా ఆదరించిన సొంత నియోజకవర్గంలో జగన్ ధర్నాకు దిగినా, ఆయనకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి రాకపోవడం, స్పందన కరువవడం పులివెందుల రాజకీయాల్లో వచ్చిన మార్పును చాటిచెబుతోంది.

Related posts

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Satyam News

కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల  గ్యాస్ కొరత

Satyam News

పెట్రోల్ మంటలు: నేటివి కావు.. నిన్నటి జగన్ పాలన శాపాలు!

Satyam News

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంస్య విగ్రహవిష్కరణ

Satyam News

అది దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య వివాదం

Satyam News

Leave a Comment