తూర్పుగోదావరిహోమ్

అరటి తోటలను పరిశీలించిన కేంద్ర బృందం

#Bananacrop

కాకినాడ జిల్లాలో అరటి పంటకు జరిగిననష్టాలను అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT – Team-I) ఆదివారం పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి, బాధిత రైతులతో  కేంద్ర బృందం సభ్యులు నేరుగా మాట్లాడి పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో జిల్లా జాయింట్ కలెక్టర్  అపూర్వ భరత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

2026 జనవరి 20వ తేదీన 3.50 ఎకరాల విస్తీర్ణంలో కర్పూరం, చెక్కకేళి రకాల అరటి పంటను సాగు చేసినట్లు, తుఫాన్ సంభవించే సమయానికి పంట 9 నుంచి 11 నెలల వయస్సుకు చేరుకుని కోతకు సిద్ధంగా ఉంది. ఒక ఎకరానికి సుమారు 500 నుంచి 600 మొక్కలు నాటగా, సాధారణ పరిస్థితుల్లో సుమారు 500 గెలలు దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు, ఒక్కో అరటి గెలకు మార్కెట్ పరిస్థితులను బట్టి రూ.250 నుంచి రూ.300 వరకు ధర లభిస్తుందని, ఈ లెక్కన ఒక ఎకరానికి సుమారు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు స్థూల ఆదాయం వచ్చే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో, ముఖ్యంగా కార్తీక మాసంలో అరటికి మంచి ధర లభిస్తుందని ఆశించినట్లు వారు వివరించారు. అయితే తుఫాన్ సమయంలో వీచిన తీవ్ర గాలుల కారణంగా అరటి మొక్కలు పెద్ద సంఖ్యలో నేలకొరిగాయని, కొన్ని మొక్కలు విరిగిపోయి మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని జిల్లా ఉద్యాన శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు.

క్షేత్రస్థాయి పరిశీలనలో 50 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు. అరటి తోట సాగు కోసం ఇప్పటివరకు సుమారు రూ.1.20 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు అధికారులు వివరించారు. మొక్కల కొనుగోలు, ఎరువులు, కూలీల ఖర్చులు, అంతర సేద్య పనులు, ఇతర యాజమాన్య ఖర్చుల వివరాలను కేంద్ర బృందానికి తెలియజేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ,అర్హత కలిగిన పంట నష్టపోయిన అరటి రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెక్టారుకు రూ.35,000 చొప్పున పంటనష్టపరిహారం అందించనున్నట్లు వివరించారు. ప్రభుత్వం అందించే పరిహారం తిరిగి పంట సాగు చేపట్టేందుకు ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు.

నేలకొరిగిన మొక్కలను తొలగించడం, కొత్త మొక్కలను నాటడం, వాటికి ఆధారాలు ఏర్పాటు చేయడం,ఎరువులు కొనుగోలు చేయడం, కూలీల ఖర్చులు భరించడం వంటి పనులకు పరిహారం కొంతమేర తోడ్పడుతుందని  తెలిపారు. కేంద్ర బృందం సభ్యులు క్షేత్ర స్థాయిలో పంట నష్టం తీవ్రత ను పరిశీలించి, రైతు పెట్టుబడి, ఆశించిన దిగుబడి, మార్కెట్ ధరలు, పంట నష్టం కారణంగా ఎదురైన ఆర్థిక నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పరిశీలనలో గుర్తించిన అంశాలను తమ నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. కోతకు సిద్ధంగా ఉన్న దశలో తుఫాన్ కారణంగా అరటి పంట దెబ్బతినడంతో రైతు ఆశించిన ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని కేంద్ర బృందానికి అధికారులు వివరించారు.

Related posts

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News

ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏమన్నారంటే

Satyam News

జపాన్ లో తీవ్ర భూకంపం: సునామీ హెచ్చరిక

Satyam News

నేడు పవిత్ర భీష్మ ఏకాదశి

Satyam News

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

షేక్ హసీనా నేరస్థురాలే: న్యాయస్థానం వెల్లడి

Satyam News

Leave a Comment