హైదరాబాద్హోమ్

గిగ్ వర్కర్లతో 14న రాహుల్ గాంధీ భారీ ర్యాలీ

#RahulGandhi

హైదరాబాద్‌లో ఈ నెల 14న గిగ్ వర్కర్లతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీ సమీపంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్‌ఐసీసీ పక్కన జయభేరి, మీనాక్షి టవర్స్ సమీపంలోని మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ర్యాలీ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, ఇతర సదుపాయాలపై అధికారులతో చర్చించారు.

గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రతకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలిగించే నిబంధనలు, మార్గదర్శకాలు, సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేస్తూ వివిధ ఆన్‌లైన్ వేదికలు, సంస్థల ద్వారా సేవలందిస్తున్న గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడం, వారి సంక్షేమాన్ని పరిరక్షించడం ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.

ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ నేరుగా గిగ్ వర్కర్లతో మాట్లాడనున్నారు. వారి పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, ఆదాయ భద్రత, సంక్షేమం, సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలపై వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. గిగ్ వర్కర్ల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడంతో పాటు, వారికి ప్రభుత్వపరంగా అందించాల్సిన రక్షణ, ప్రయోజనాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

గిగ్ వర్కర్లకు సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటన, గిగ్ వర్కర్లతో నిర్వహించనున్న ర్యాలీకి ప్రాధాన్యత ఏర్పడింది.

Related posts

IAS శ్రీలక్ష్మికి గౌరవ వీడ్కోలు..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

Satyam News

మరింత ప్రభావం చూపించనున్న అల్పపీడనం

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

‘స్త్రీ శక్తి’ తో మహిళలకు ఆర్థిక చేయూత

Satyam News

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

Satyam News

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

Satyam News

Leave a Comment