పశ్చిమగోదావరిహోమ్

సాగునీటి సంఘాల అధ్యక్షులతో త్వరలో సమావేశం

#NimmalaRamanaidu

ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, కడా కమిషనర్ ప్రశాంతి, ఈఎన్సీ నరసింహమూర్తి, వివిధ ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాటర్ సెక్యూరిటీ, వాటర్ క్యాలెండర్, భూగర్భ జలాల పెంపు వంటి కీలక వాటర్ పాలసీలపై సాగునీటి సంఘాల అధ్యక్షులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు.

ఈ నెల చివరి వారంలో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాల కంటే సాగునీటి రంగమే అత్యంత తీవ్రంగా దెబ్బతిందని మంత్రి విమర్శించారు. సాగునీటి సంఘాలను అప్పటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, దాని ఫలితంగా రైతుల ఇబ్బందులను పట్టించుకునే వ్యవస్థే లేకుండా పోయిందన్నారు.

సాగునీటి సంఘాలు లేకపోవడంతో నిర్వహణ కరువై నీటివనరులు కూడా నష్టపోయాయని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు.

సాగునీటి సంఘాలకు పూర్వ వైభవం తీసుకువచ్చి, రైతులను భాగస్వాములను చేసిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఆరేళ్ల తరువాత నిర్వహించిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్నదాతలకు అఖండ విజయం లభించిందని, కూటమిలోని అన్ని పార్టీల ఐక్యతకు రైతులు ఏకపక్షంగా మద్దతు పలికారని మంత్రి తెలిపారు. సాగునీటి సంఘాల ద్వారా రైతులకు, రైతు బిడ్డలే సేవలు అందించేలా దాదాపు 60 వేల మందికి సాగునీటి రంగంలో ప్రాతినిధ్యం కల్పించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరోసారి రైతు పక్షపాతిగా తనను తాను నిరూపించుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.

Related posts

అరకు లోయ లో కనిపించిన భూమి

Satyam News

స్విట్జర్లాండ్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు

Satyam News

శ్రీవారి భక్తుడితో దురుసుగా ప్రవర్తించిన టాక్సీ డ్రైవర్‌పై చర్యలు

Satyam News

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News

ఉమ్మడి ఖమ్మం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం

Satyam News

జన నాయగన్ నా ఆఖరి చిత్రం

Satyam News

Leave a Comment