కృష్ణహోమ్

కూటమి సునామీతో మారిన క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలు!

#CBN

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ స్థానిక రాజకీయాల్లో ఒక స్పష్టమైన ఓటర్ల తీర్పును ఆవిష్కరించాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి (తెలుగుదేశం, జనసేన, బీజేపీ) సాధించిన విజయాలు కేవలం ఓట్ల ఆధిక్యత మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో మారిన రాజకీయ మార్పుకు నిదర్శనం.

గతంలో వైఎస్సార్సీపీకి పట్టున్న ప్రాంతాల్లో సైతం కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ఎంపీటీసీ ఫలితాల్లో కూటమి ఏకంగా 75.45% స్థానాలను (5,861 స్థానాలు) కైవసం చేసుకోగా, వైఎస్సార్సీపీ 22.03% (1,711 స్థానాలు) దగ్గరే పరిమితమైంది.

జెడ్పీటీసీ స్థాయికి వచ్చేసరికి ఈ వ్యత్యాసం మరింత తీవ్రమైంది. మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి 85.74% (499 స్థానాలు) గెలుచుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేయగా, వైఎస్సార్సీపీ కేవలం 76 స్థానాలకే పరిమితమైంది.

ఫ్యాన్‌కు ఊరట ఇచ్చింది ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లా మాత్రమే. అక్కడ మాత్రమే ఆ పార్టీ ముందంజలో ఉంది. ఏడు జిల్లాల్లో జెడ్‌పీటీసీ ఖాతానే తెరవలేదు. పార్టీ అధినేత సొంత కడప జిల్లాలో కూడా ఎంపీటీసీ వాటా 14.5 శాతమే.

స్థానిక ఓటరు పంపిన స్పష్టమైన సంకేతం

తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంక్, జనసేన పార్టీ యువతలో తెచ్చిన ఉత్సాహం, బీజేపీ పొత్తుతో ఏర్పడిన రాజకీయ స్థిరత్వం స్థానికంగా బాగా పనిచేసాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనకాపల్లి, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, ప్రకాశం వంటి జిల్లాల్లో కూటమి దాదాపు క్లీన్ స్వీప్ దిశగా సాగింది.

ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ వ్యవస్థలోనూ, స్థానిక పాలనలోనూ నూతన సమీకరణాలకు బాటలు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts

ఫేక్ కథనంపై డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ పరువు నష్టం నోటీసులు

Satyam News

పాస్టర్ కొడుకు పై అత్యాచారం ఫిర్యాదు

Satyam News

ప్రత్యేక ప్రదర్శనల పేరుతో సినీ జనం లూటీ

Satyam News

నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక అవార్డు

Satyam News

విశాఖకి అమెజాన్‌..  ఐటీ ప్లస్‌ AWS డేటా సెంటర్‌..!

Satyam News

ఆస్తి కోసం సొంత నేతపై వైసీపీ లీడర్‌ గొడ్డలి వేటు…!!

Satyam News

Leave a Comment