ముఖ్యంశాలుహోమ్

రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం

#rain

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 15కిమీ వేగంతో ఉత్తరవాయవ్య దిశగా కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు.

ప్రస్తుతానికి ఇది శ్రీలంకలోని టింకోమలికి 620 కి.మీ, శ్రీ విజయ పురానికి (అండమాన్ నికోబార్ దీవులు) 680 కి.మీ, చెన్నైకి 800 కి.మీ, విశాఖపట్నానికి 960 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1070 కి.మీ దూరంలో  కేంద్రీకృతమైందని పేర్కొన్నారు.

ఇది ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ రేపు దక్షిణ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తుపానుగా, ఎల్లుండికి ఇది పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆ తదుపరి రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో గురు,శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

కోస్తాంధ్ర తీరం వెంబడి మంగళవారం వరకు  40-60కిమీ వేగంతో ఈదురుగాలులు , ఆతరువాత క్రమంగా పెరుగుతాయని తెలిపారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related posts

మెరుస్తున్న కలలకు వాస్తవ రూపం

Satyam News

ఆంధ్రా పోలీసులు తప్పు చేశారా?… అసలేం జరిగింది?

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

బార్ పెట్టాలంటే భయపడక్కరలేదు!

Satyam News

లైంగిక వ్యాధులతో బిల్ గేట్స్… నిజామా?

Satyam News

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News

Leave a Comment