ప్రత్యేకంహోమ్

అతి తీవ్ర తుపానుగా మారిన అక్వాన్‌

#Rain

ఇటీవలే అర్నబ్, మురసు తుపాన్లు కోస్తాంధ్రను వణికించగా, తాజాగా మరో తుపాను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది రాష్ట్రంపై భారీగా ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మచిలీపట్నం- ఒడిశాలోని గోపాల్‌పూర్‌ మధ్య ఎక్కడైనా ఈ తుపాను తీరం దాటొచ్చని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. తుపాను నేపథ్యంలో ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని పలు చోట్ల భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

వాయుగుండం సోమవారానికి తుపానుగా బలపడనుంది. దీనికి అక్వాన్‌గా ఇరాన్‌ నామకరణం చేసింది. అక్వాన్‌ అంటే రాక్షస శక్తి అని అర్థం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం ఏర్పడిన వాయుగుండం అక్కడే కేంద్రీకృతమైంది. సాయంత్రానికి 15 కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోందని వాతావరణశాఖ తెలిపింది. ‘ప్రస్తుతానికి ట్రింకోమాలికి 620 కి.మీ., చెన్నైకి 800, విశాఖకు 960 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ సోమవారానికి మరింత బలపడనుంది. దక్షిణ, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. మంగళవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం కనిపిస్తోంది.

తర్వాత రెండు రోజుల్లో మరింత బలపడి ఏపీ తీరం వైపు ఉత్తరం దిశగా కదలనుంది. ఈ నెల 17న ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం వరకు తీవ్ర తుపానుగా కొనసాగనుంది. తర్వాత మరింత బలపడి 18 రాత్రికి అతి తీవ్ర తుపానుగా మారి 19న ఉదయం వరకు కొనసాగనుంది. ఈ సమయంలో 90 కి.మీ. నుంచి గరిష్ఠంగా 130 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉంది.’ అని వాతావరణశాఖ పేర్కొంది.

తుపాను ప్రభావంతో 18న కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర అంతటా అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. ఆ సమయంలో 21 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. రాయలసీమలోనూ భారీ వర్షాలు పడనున్నాయి. 19న ఉదయం నుంచి 20న ఉదయం వరకు ఏపీ తీరం వెంట 145 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

Related posts

మంచి కంటెంట్‌తో రాబోతోన్న ‘కర’

Satyam News

పులివెందులలో జగన్ మార్క్ రాజకీయం ఇదేనా..?

Satyam News

రజనీ పవర్ అర్థమైందా రాజా….

Satyam News

పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం

Satyam News

విజయవాడ లాకప్ డెత్ పై హక్కుల సంఘం ఆగ్రహం

Satyam News

మరో మూడు రోజులు ఒక వైపు ఎండ మరొక వైపు వాన

Satyam News

Leave a Comment