ముఖ్యంశాలుహోమ్

పులివెందులలో జగన్ మార్క్ రాజకీయం ఇదేనా..?

#PuttaKrishnachaitanyareddy

తప్పుడు ప్రచారాలు చేయడం, ఎదుటివారిపై నిందలు వేయడం.. ఇదేనా జగన్ రెడ్డి రాజకీయ విధానం? అని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ప్రశ్నించారు. జగన్ రెడ్డి తన సొంత బాబాయ్ హత్య కేసులోనూ రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేసిన చరిత్రను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆయన అన్నారు. ఇప్పుడు పులివెందులలో జరుగుతున్న పరిణామాల విషయంలోనూ అదే తరహాలో ఎదురు దాడికి దిగడం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. తాను వాస్తవానికి తన కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్‌లో ఉన్నానని, అయితే నేను పులివెందులకు వచ్చి అరాచకాలు చేస్తున్నానంటూ జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయించడం హాస్యాస్పదం అని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు.. రాజకీయ డ్రామాలను కూడా గమనిస్తున్నారు అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఆరోపణలతో కాదు.. వాస్తవాలతో మాట్లాడాలి. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరు అని ఆయన అన్నారు.

Related posts

డ్రగ్స్ రహిత రాష్ట్రం గా ఆంధ్ర ప్రదేశ్

Satyam News

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కవిత?

Satyam News

భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం

Satyam News

తిరుమలలో వైసీపీ రాజ్యం నడుస్తోందా?

Satyam News

20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగ

Satyam News

Leave a Comment