హైదరాబాద్హోమ్

డయల్ 112 ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి

#CybarabadPolice

డయల్ 112కు ఫిర్యాదు చేసిన బాధితుల సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన బాచుపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

నేరాలకు సంబంధించిన వాహనాలు, వదిలివేయబడిన వాహనాల వివరాలతో ప్రత్యేక జాబితా రూపొందించాలని సూచించారు. వాటిని చట్ట నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, పురుష సిబ్బంది వసతి గృహాన్ని పరిశీలించి పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మహిళా కౌన్సెలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలు, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణ స్పందనతో పాటు సమస్యల పరిష్కారం జరిగే వరకు పర్యవేక్షణ కొనసాగించాలని ఈ సందర్భంగా సీపీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, కుత్బుల్లాపూర్ డివిజన్ ఏసీపీ ఎ.సి. బాల గంగిరెడ్డి పాల్గొన్నారు.

Related posts

తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్

Satyam News

ఎజిఐసిఎల్‌‌లో సిబ్బంది కొరత: మరి అభివృద్ధి ఎలా?

Satyam News

రేపు ఐదు జిల్లాల్లో పోలియో దినోత్సవం

Satyam News

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

మిథున్ రెడ్డికి బిగ్‌షాక్..బెయిల్ రద్దు.?

Satyam News

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

Satyam News

Leave a Comment