కృష్ణహోమ్

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

#PaddyCrop

యూరియాను అధిక మోతాదులో విచక్షణారహితంగా వాడడం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మి దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూరియాను శాస్త్రీయ నిష్పత్తి (4:2:1) కి బదులుగా రైతులు విపరీతంగా (7:2.8:1) వాడుతున్నారన్నారన్నారు.

దీనివల్ల నేల నిస్సారం కావడం, తెగుళ్లు పెరగడం, పెట్టుబడి ఖర్చు పెరగడం, వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడతాయన్నారు. ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సూచించిన కొన్ని ఆధునిక పద్ధతుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునన్నారు. దీనిలో భాగంగా 500 ఎమ్ఎల్ బాటిల్ నానో యూరియా 45 కిలోల  బస్తా యూరియాతో సమానమని అన్నారు.

భూసార పరీక్షల ద్వారా  20% వరకు యూరియా వాడకాన్ని తగ్గించవచ్చున్నారు. వేప పూత పూసిన యూరియా  (నీమ్ కోటెడ్ యూరియా) వాడకం వల్ల నత్రజనిని మొక్కలకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంచుతుందన్నారు. యూరియా అనేది పంటకు మందు లాంటిదని, మోతాదు మించితే విషంగా మారుతుందని అన్నారు. సుస్థిర, లాభదాయక వ్యవసాయం కోసం శాస్త్రీయ పద్ధతులు పాటించాలని ఉప కులపతి డా. శారదా జయలక్ష్మి దేవి ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

మహిళా పోలీస్ స్టేషన్ పై పెట్రోల్ బాటిల్ తో దాడి

Satyam News

సిగ్గుపడుతున్న జగన్: ఎందుకో తెలుసా?

Satyam News

ప్లాట్ ఫామ్ ఫీజును మళ్లీ పెంచిన స్విగ్గీ

Satyam News

తిరుగుబాటు చేసి బలి అయిన కవిత

Satyam News

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Satyam News

17 నుంచి బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్

Satyam News

Leave a Comment