జాతీయంహోమ్

గోద్రా రైలు దగ్ధం కేసులో దోషికి జీవిత ఖైదుపై స్టే

#GodhraTrain

ఇర్ఫాన్ సిరాజ్ పడా అనే వ్యక్తి గోద్రా సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు దగ్ధం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి. వైద్య కారణాలను పరిగణనలోకి తీసుకుని ఆయన జీవిత ఖైదు శిక్ష అమలును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే 18 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్న ఆయన వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ పి.బి. వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వైద్య కారణాల ఆధారంగా పిటిషనర్‌కు శిక్ష అమలును నిలిపివేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు అత్యంత తీవ్రమైనదని అభిప్రాయపడినప్పటికీ, ఇర్ఫాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరఫు న్యాయవాది చేసిన వాదనలు వాస్తవమేనని గుజరాత్ ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. వైద్య కారణాలతో శిక్ష అమలును నిలిపివేయడంపై తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

గుజరాత్‌లో 2002 అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన బిపిన్ చంద్ర జోషి, ప్రదీప్ మోర్ధియా జీవిత ఖైదు శిక్షలను కూడా నవంబర్ 16న సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. వారు 17 సంవత్సరాలకు పైగా జైలులో గడిపిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది.

2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి కరసేవకులతో తిరిగి వస్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్-6 బోగీకి గుజరాత్‌లోని గోద్రా వద్ద నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.

దీనికి సంబంధించి 2011 మార్చిలో విచారణ కోర్టు 31 మందిని దోషులుగా నిర్ధారించింది. వారిలో 11 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది. మరో 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, 2017లో గుజరాత్ హైకోర్టు 11 మంది మరణశిక్షలను జీవిత ఖైదుగా తగ్గించింది. మిగిలిన 20 మందికి విధించిన జీవిత ఖైదును సమర్థించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దోషులు 2018లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసులో గతంలోనూ పలువురు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2022 మేలో భార్య ప్రాణాంతక క్యాన్సర్‌తో బాధపడుతున్న కారణంగా అబ్దుల్ రెహమాన్ ధాంతియాకు ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అదే ఏడాది డిసెంబర్‌లో 17 సంవత్సరాలకు పైగా జైలులో గడిపిన ఫరూక్‌కు బెయిల్ మంజూరు చేసింది. 2023 ఏప్రిల్‌లో మరో ఎనిమిది మంది దోషులకు కూడా బెయిల్ ఇచ్చింది.

Related posts

22, 23న గద్వాల, వనపర్తి కి సమాచార కమిషనర్ల రాక

Satyam News

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు

Satyam News

అనిల్ అంబానీపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు

Satyam News

గంజాయి కేసులో వైసీపీ లీడర్ కామాక్షి అరెస్ట్!

Satyam News

పోలీసులపై ఆరోపణలు చేస్తున్న కాక్రోచ్ లు…

Satyam News

Leave a Comment