నెల్లూరుహోమ్

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

#ChandrababuN

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా మైపాడు గేటులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ కంటెయినర్ షాపులు వీధి వ్యాపారులకు స్థిరమైన వ్యాపార వేదికను కల్పించనున్నాయి. ఈ మార్కెట్‌లో మొత్తం 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపులు ఏర్పాటు చేశారు.

ప్రతి కంటెయినర్‌లో 4 షాపులు ఉండేలా ప్రభుత్వం వినూత్నంగా రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ స్మార్ట్ వెండింగ్ మార్కెట్ ద్వారా మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీధి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా స్థిరమైన వ్యాపారం చేసుకునే వేదికను ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ కొత్త ఆలోచనకు ప్రశంసలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఏడు నెలల గర్భిణి, భర్త ఆత్మహత్య

Satyam News

వరల్డ్ బైసైకిల్ డే సందర్బంగా సండేస్ ఆన్ సైకిల్

Satyam News

చిట్యాల వద్ద ప్రమాదం: నలుగురు మృతి

Satyam News

శ్రీశైలం లో ఉగాది మహోత్సవములు ప్రారంభం

Satyam News

సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

Satyam News

విశాఖ నగరంలో వెహికల్ రిటర్న్ మేళా

Satyam News

Leave a Comment