26.3 C
Hyderabad
September 19, 2026
రంగారెడ్డిహోమ్

ప్రముఖ కవి అందెశ్రీ ఆకస్మిక మృతి

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.

అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌.

Related posts

విశాఖ గో మాంసం అక్రమ నిల్వల వెనుక ఎవరున్నా వదలొద్దు

Satyam News

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

దాసరి నారాయణరావు ఒక ఇన్స్టిట్యూషన్

Satyam News

ప్రజా పాలన కు 99 రోజుల యాక్షన్ ప్లాన్

Satyam News

అసెంబ్లీ కి వెళ్లనున్న సినీ హీరోయిన్ త్రిష?

Satyam News

Leave a Comment