25.2 C
Hyderabad
September 20, 2026
అనంతపురంహోమ్

పరకామణి దొంగలు చేసిన దారుణ హత్య ఇది…

#ParakamaniCase

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన రూ. వంద కోట్ల పరకామణి చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ స్కామ్‌కు సంబంధించిన సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమైన గుంతకల్లు రైల్వే సీఐ వై. సతీష్ కుమార్ (45) హత్యపై పోలీసులు దృష్టి సారించారు.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఇది పక్కా హత్యే అని తేలింది. తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ జరిగింది. సతీష్ కుమార్ సోదరుడు హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వే పీఎస్‌లో BNS సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేశారు.

SIT ఆధారాల ప్రకారం పరకామణి కేసుకు సంబంధించి దాదాపు రూ. 100 కోట్ల ఆస్తులు చేతులు మారినట్లు సమాచారం. 2023 ఏప్రిల్‌లో హుండీ లెక్కింపు సమయంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తుండగా సతీష్ పట్టుకున్నాడు. కానీ, రాజకీయ ఒత్తిడితో కేసు లోక్ అదాలత్‌లో రాజీ అయ్యింది. 

టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లోనే లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. మా సోదరుడు నోరు విప్పితే పెద్దల బాగోతం బయటపడుతుంది. అందుకే హత్య చేశారు అని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 

కేసు తీవ్రత దృష్ట్యా CID DG రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురం చేరుకుని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక కోణాలు, కుట్రపై లోతుగా దర్యాప్తు చేయాలని దిశానిర్దేశం చేశారు. రైలు కోచ్ ప్రయాణికుల వివరాలు, సాంకేతిక ఆధారాల సేకరణపై దృష్టి సారించారు.

గతంలో కీలక హత్య కేసులు, సైబర్ నేరాలను విచారించిన అనుభవజ్ఞులైన అధికారులను బృందంలో నియమించారు.  దీంతో శ్రీవారి హుండీ నుంచి కోట్లతో పాటు భక్తుల విశ్వాసాన్ని దోచుకున్న దొంగను దోచుకొని, రాజీచేసిన నాటి వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

హుండీ దొంగతనం నేరాన్ని కూడా ఆస్తుల ఆర్జనగా మార్చుకున్న ఈ భూమన కరుణాకర్ రెడ్డికి ఇవన్నీ అర్థం అయ్యే.. రోజూ టీటీడీ మీద పెడబొబ్బలు పెడుతూ రాద్దాంతం చేస్తున్నాడు. అధికారంలో లేకున్నా హత్య చేయించడానికి, ఈ వైకాపా నేరస్తులు వెనుకాడడం లేదంటే వీరు బరితెగింపు పరాకాష్టకు వెళ్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Related posts

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News

సిట్ నోటీసులు చిల్లర రాజకీయాలే

Satyam News

లోకేష్‌…. టాప్ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ లీడర్‌…!!

Satyam News

నందికొట్కూరు లో డ్రగ్ చాక్లెట్లు?

Satyam News

పల్నాడులో రూ.3,312 కోట్ల రుణాల పంపిణీ

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

Leave a Comment