25.3 C
Hyderabad
September 29, 2026
ముఖ్యంశాలుహోమ్

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

#DubaiAirShow

దుబాయ్ ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌షో ప్రదర్శన లో పాల్గొంటున్న భారత యుద్ధ విమానం శుక్రవారం ప్రమాదానికి గురైంది. భారత వాయుసేన వినియోగించే HAL తేజస్‌ ఫైటర్ జెట్ మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ప్రేక్షకుల ముందు ఎగురుతున్న సమయంలో కుప్పకూలినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. పైలట్ బయటకు దూకాడా లేదా ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా అన్న వివరాలు తక్షణం అందుబాటులోకి రాలేదు.

ప్రమాదం జరిగిన వెంటనే దుబాయ్ వరల్డ్ సెంట్రల్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో నల్లటి పొగ మేఘాలు ఎగసిపడ్డాయి. అక్కడికి వచ్చి ఉన్న ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అత్యవసర సేవలు అందించే శకటాలు అక్కడకు చేరుకుని సేవలు అందించాయి. ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే దుబాయ్ ఎయిర్‌షో ఈసారి భారీ విమాన ఆర్డర్లతో ప్రత్యేకంగా నిలిచింది.

ఎమిరేట్స్ మరియు ఫ్లైదుబాయ్ సంస్థలు పలు ప్రధాన ఆర్డర్లు ప్రకటించిన సమయంలోనే ఈ ప్రదర్శన విమానం ప్రమాదం చోటుచేసుకోవటం ఆ కార్యక్రమాన్ని కాసేపు స్థంభింపజేసింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పరిశీలిస్తున్నారు.

Related posts

ఈ గెలుపు నా సపోర్టర్స్ అండ్ ఫ్యామిలీది

Satyam News

ప్లేటు ఫిరాయించిన సోనం వాంగ్ చుక్

Satyam News

తిరుమలలో భక్తులకు ఇబ్బందులు

Satyam News

నిరాహార దీక్ష విరమించిన కాక్రోచ్ దీప్కే

Satyam News

ఖైరతాబాద్‌ పేరును ‘గణేష్‌పురి’గా మార్చాలి

Satyam News

ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు సీఎస్

Satyam News

Leave a Comment