ముఖ్యంశాలుహోమ్

జనసేన పార్టీ పునర్నిర్మాణానికి కొత్త విధానం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

రేపటి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించి, రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున పార్టీ నిర్మాణంపై సమీక్ష చేపడతామని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యం కలిగిన నాయకులను తయారు చేయడం, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా పనిచేస్తోందని, నిర్వీర్యమైన గ్రామపంచాయతీలకు పవన్ కళ్యాణ్ జీవం పోశారని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వరకు విశాఖ విమానాశ్రయాన్ని కొనసాగించడం మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కూటమి బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

Related posts

అండమాన్ నికోబార్ దీవుల్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావదినోత్సవం

Satyam News

రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం

Satyam News

అమెరికాలో అడవులను దగ్ధం చేస్తున్న కార్చిచ్చు

Satyam News

ఇరాన్ కు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Satyam News

శ్రీ పద్మావతి అమ్మవారి  కార్తీక బ్రహ్మోత్సవాల‌లో సాంస్కృతిక‌ శోభ

Satyam News

మళ్లీ అమెరికా వెళుతున్న కవిత

Satyam News

Leave a Comment