ముఖ్యంశాలుహోమ్

తుంగభద్ర డ్యాం కొత్త స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవం

#CMChandrababu

కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లాలో ఉన్న తుంగభద్ర డ్యాంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంయుక్తంగా ప్రారంభించారు.

తుంగభద్ర జలాశయం భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.51 కోట్ల వ్యయంతో 33 కొత్త స్పిల్‌వే గేట్లను ఏర్పాటు చేశాయి.

గేట్ల ప్రారంభోత్సవం అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి హోసపేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు బయలుదేరారు. ఈ సభలో తుంగభద్ర ప్రాజెక్టు ప్రాధాన్యం, అంతర్రాష్ట్ర జల సహకారం, సాగునీటి అభివృద్ధి అంశాలపై నాయకులు ప్రసంగించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంట రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.

Related posts

తిరుమలపై కుట్రలు ఆపవా జగన్…..?

Satyam News

మెడికల్ కాలేజీలకు కులం రంగు పులుముతున్న జగన్

Satyam News

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

Satyam News

సొంత నియోజకవర్గంలో కేటీఆర్ కు అవమానం

Satyam News

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

భారతీయులకు బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు

Satyam News

Leave a Comment