26.3 C
Hyderabad
September 19, 2026
చిత్తూరుహోమ్

పరకామణి చోరీ కేసు… ఏ క్షణమైనా భూమన అరెస్ట్‌..!!

#BhumanaKarunakarReddy

తిరుమల పరకామణి చోరీ కేసులో వైసీపీ నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డికి బిగ్‌షాక్ ఇచ్చారు CID అధికారులు. భూమనకు నోటీసులు జారీ చేశారు. పద్మావతి అతిథి గృహంలో మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని కోరారు CID అధికారులు. 2023 ఏప్రిల్ 7న తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్‌ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పరకామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్‌ 7న కేసు నమోదైంది. 

అప్పట్లో TTD AVSOగా పనిచేసిన సతీశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇక, ఈ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో CID డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా ఈ కేసు విచారణ చేపట్టారు.  హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణిలో కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం డిసెంబరు 2వ తేదీలోగా రిపోర్టు ఇచ్చేందుకు విచారణ చేపట్టింది.

అదే సమయంలో విచారణ నిమిత్తం వస్తున్న AVSO సతీష్‌కుమార్‌ మృతి చెందడం కేసు తీవ్రతను మరింత పెంచింది. సతీష్ కుమార్ మృతితో దర్యాప్తులో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం తిరుపతి పద్మావతి గెస్ట్‌హౌస్‌లో అప్పటి TTD VGO గిరిధర్‌ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారమిచ్చారా అని ఆరా తీశారు. చోరీపై TTD విజిలెన్స్‌ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, సంబంధిత ఫైల్స్, ఇతర వివరాలు ఎవరికి సమర్పించారని ఆడిగినట్లు సమాచారం.

తాము సేకరించిన విషయాలు అప్పటి CVSO నరసింహకిశోర్‌కు తెలియజేసినట్లు గిరిధర్‌ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, కేసు రాజీలో సతీష్‌కుమార్‌కు ఏమైనా సలహాలు ఇచ్చారా? ఆయనపై ఎవరిదైనా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారా..? అని ప్రశ్నించినట్లు సమాచారం. దానికి..సరిగ్గా గుర్తించలేదని గిరిధర్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత అప్పటి AVSO పద్మనాభంను ప్రశ్నించారు.

మరోవైపు, సిట్ సేకరించిన కీలక ఆధారాలతో భూమనకి లింకులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.. ఇదే నిజం అయితే, ఆయనను ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకునే చాన్స్‌ ఉందని తెలుస్తోంది.. ఇప్పటికే, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి లిక్కర్‌ స్కామ్‌లో జైలులో ఊచలు లెక్క పెడతున్నాడు.. పరకామణి చోరీ కేసులో భూమన అరెస్ట్ అయితే, వైసీపీకి అది బిగ్‌ డ్యామేజ్ అవుతుంది. అధినేత జగన్‌ నుండి చోటా మోటా లీడర్ల వరకు అంతా స్కామ్‌లలో చిక్కుకుపోతున్నారనే భావన జనాలకు చేరుతోంది.. మరి, ఈ కేసుల నుండి వైసీపీ ఎలా బయటపడుతుందో చూడాలి.

Related posts

జమాత్-ఎ-ఇస్లామీ సంస్థ పై ఎన్ ఐఏ దాడులు

Satyam News

పొగాకు రైతులకు డబుల్ ధమాకా…. కూటమి ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌

Satyam News

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

సంఘ్ శ‌తాబ్ది ఉత్స‌వ వేళ‌ గణవేష్ అభియాన్

Satyam News

దేశ మహిళలను మోసం చేసిన బీజేపీ

Satyam News

పశ్చిమ బెంగాల్ లో చీలిపోయిన మమతా బెనర్జీ పార్టీ

Satyam News

Leave a Comment