ప్రత్యేకంహోమ్

పొగాకు రైతులకు డబుల్ ధమాకా…. కూటమి ప్రభుత్వం భారీ ప్యాకేజ్‌

#Pemmasani

అంతర్జాతీయ సంక్షోభం, అధిక ఉత్పత్తి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి పొగాకు రైతుకు ఒక్కో బార్న్‌కి రెండేళ్ల కాలానికి రూ. 50,000 వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

దీనికి తోడు రైతులు ఆశించినంత ధరలు లేని లో-గ్రేడ్, ఆఫ్-స్టైల్ పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ. 10 చొప్పున అదనపు సాయం అందించనుంది. ఈ రెండు కీలక నిర్ణయాల అమలు కోసం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 250 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందని, మొత్తం రూ. 350 కోట్ల అదనపు భారాన్ని భరిస్తున్నాయని స్పష్టం చేశారు.

ఈ సీజన్‌కు గానూ పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీల FCV పొగాకు పండించడానికి అనుమతి ఇస్తే, అనుకూల వాతావరణం వల్ల రైతులు ఏకంగా 240 మిలియన్ కిలోలు పండించారని పెమ్మసాని తెలిపారు. అంటే మార్కెట్‌లోకి 100 మిలియన్ కిలోల అదనపు పంట రావడంతో పాటు, అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల పొగాకు రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి.

ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా జరిపిన ఉన్నత స్థాయి చర్చల ఫలితంగానే కేంద్రం ఈ వడ్డీ లేని రుణ సాయానికి అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు.

అదనపు దిగుబడిలో ఉన్న 90 మిలియన్ కేజీల లో-గ్రేడ్, ఆఫ్-స్టైల్ పొగాకును కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు సైతం సానుకూలంగా స్పందించారు. లో-గ్రేడ్ పొగాకును కేజీ రూ. 110కి, ఆఫ్-స్టైల్ రకాన్ని కేజీ రూ. 130కి కొనుగోలు చేస్తామని ఎగుమతిదారులు అంగీకరించారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ. 10 అదనపు సాయం మొత్తం సోమవారం నుంచే నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానుంది. అలాగే కేంద్రం ఇచ్చే రూ. 50,000 వడ్డీ లేని రుణాన్ని రైతులు రెండేళ్ల కాలంలో, ఏటా 50 శాతం చొప్పున చెల్లిస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి వివరించారు.

మొత్తానికి, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి, కేంద్రంతో సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడం వల్ల వేల సంఖ్యలోని రైతు కుటుంబాలకు ఆర్థిక ఊరట లభించింది. అనవసర రాజకీయ విమర్శలకు తావివ్వకుండా, ప్రాక్టికల్ గ్రౌండ్-లెవల్ సొల్యూషన్స్‌తో రూ. 350 కోట్ల ఆర్థిక ప్యాకేజీని రంగంలోకి దించి కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam News

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీస్ హబ్

Satyam News

హైదరాబాద్ లో భారీ గా పట్టుబడ్డ నకిలీ నోట్లు

Satyam News

అంగరంగ వైభవంగా భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!

Satyam News

Leave a Comment