తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా బయల్దేరారు. 15 రోజుల పాటు ఆమె అమెరికాలో పర్యటిస్తారు. ఆమె పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోనే చదువుతున్నాడు. ఇప్పుడు చిన్న కుమారుడు ఆర్య కూడా చదువుకునేందుకు అమెరికా వెళుతున్నాడు. అమెరికాకు వెళుతున్న ఎమ్మెల్సీ కవితతో ఆదిత్య, ఆర్యా ఉన్నారు. కవిత భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో వారికి సెండాఫ్ ఇచ్చారు. సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు తిరిగి కవిత రానున్నారు.
previous post
next post